Tamannaah Bhatia : మనిషిగా పుట్టిన తర్వాత ఎవరికైనా కోపం సహజం.. ఎప్పుడో ఒకప్పుడు కోపం రాక మానదు. ఎంత పెద్ద స్టార్ సెలబ్రిటీ అయినా ఎన్ని యోగాసనాలు వేసిన.. ఎంత మైండ్ కంట్రోల్లో పెట్టుకున్న కచ్చితంగా వాళ్లకి కోపం వస్తుంది. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా చెలామణి అవుతున్న వాళ్లకు కూడా కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తమ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు.
అయితే హీరోయిన్ తమన్నా మాత్రం తన కోపాన్ని కంట్రోల్ చేసుకునే పద్ధతి చాలా వెరైటీగా ఉంటుందట. ఇది తెలిసిన ఆమె అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. మిల్కీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న తమన్నా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక క్రేజ్ దక్కించుకునింది. నిజానికి తమన్నాకి కోపం చాలా రేర్ గా వస్తుందట. కానీ తమన్నాకి కోపం వచ్చిన ప్రతిసారి ఫస్ట్ రూమ్ లోకి వెళ్లి డోర్ వేసుకుని ప్రశాంతంగా పడుకోడానికి ట్రై చేస్తుందట .
ఎవరితో మాట్లాడదట… ఇంకా ఆమెకు కోపం తగ్గకపోతే వెళ్లి కూల్ షవర్ చేస్తుందట. అప్పుడు కూల్ అయ్యాక బయటకు వచ్చి తన ప్రాబ్లం ఏంటో అందరికీ చెబుతుందట. ఇలా కోపాన్ని కంట్రోల్ చేసుకునే వాళ్లు చాలా అరుదుగా ఉంటారు. ఇది చాలా ఫన్నీగా ఉందంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. తమన్నా బాలీవుడ్ ఇండస్ట్రీలో బోల్డ్ వెబ్ సిరీస్ చేస్తుంది. ఆమె చివరిగా తెలుగులో నటించిన సినిమా భోళాశంకర్. ఇది డిజాస్టర్ కా బాప్ అనే రేంజ్ లో చెత్త రివ్యూస్ సొంతం చేసుకుంది.