Rashmika Mandanna : 2021లో అల్లు అర్జున్ ‘పుష్ప’గా మారి సినిమా తెరపై సంచలనం సృష్టించాడు. అప్పటి నుంచి ఆయన్ను మరోసారి అదే అవతారంలో చూడాలని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ నిరీక్షణ ఈ ఏడాది ఆగస్టు 15తో ముగియనుంది. అంటే ఇప్పుడు ఈ సినిమా విడుదలకు దాదాపు ఐదు నెలల సమయం ఉంది. పుష్ప పార్ట్ 1 లాగే ఈ చిత్రంలో కూడా ఆయన సరసన రష్మిక మందన్న కనిపించబోతోంది. ఇక ఈ సినిమాలో తన పాత్ర ఎలా ఉండబోతుందో రష్కీక స్వయంగా చెప్పింది. ‘పుష్ప’ సినిమా చివరి సీన్‌లో అల్లు అర్జున్, రష్మిక మందన్నల పెళ్లిని చూపించారు. ‘పుష్ప 2’లో తన పాత్ర గురించి రష్మిక మాట్లాడుతూ, ఈసారి తన పాత్ర పుష్ప భార్యగా చాలా బాధ్యతలను కలిగి ఉంటుందని తెలిపింది.
‘పుష్ప’ సినిమా కథ చందనం స్మగ్లింగ్‌కు సంబంధించినది. ఈ సినిమాలో అల్లు అర్జున్ గంధపు చెక్కల స్మగ్లింగ్ లో ప్రపంచంలోనే పేరు తెచ్చుకున్న పెద్ద స్మగ్లర్ గా చూపించనున్నారు. ఫస్ట్ పార్టులో కూలీగా కనిపించారు. వాస్తవానికి గంధపు చెక్కల స్మగ్లింగ్ చట్ట విరుద్ధం. కాబట్టి పోలీసులు పుష్పను వెంబడించారు. ఈ సినిమా ఎపిసోడ్‌లో చాలా మసాలా, డ్రామా కనిపించింది. ఇంటర్వ్యూలో రష్మిక ఈసారి మరింత డ్రామా, మసాలా ఉండబోతున్నట్లు చెప్పారు.
‘పుష్ప’ ప్రపంచవ్యాప్తంగా రూ. 350 కోట్లకు పైగా వసూలు చేసింది. ‘పుష్ప 2’ వసూళ్ల పరంగా మరింత పెద్ద బ్యాంగ్‌ను సృష్టిస్తుందని అంటున్నారు. ఈ సినిమా భారీ వసూళ్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు. అయితే అల్లు అర్జున్‌కి ఇది అంత ఈజీ కాదు.. ఎందుకంటే పుష్ప 2తో పాటు అజయ్ దేవగన్ సినిమా ‘సింగం ఎగైన్’ కూడా ఆగస్ట్ 15న విడుదలవుతోంది. ఇద్దరు తారలు తమ తమ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద ఢీకొంటారు. వీరిద్దరిలో ఎవరు బాక్సాఫీసు విజేతగా నిలుస్తారో చూడాలి.