Allu Sneha Reddy : హీరోయిన్లకు పోటీనిస్తున్న బన్నీ వైఫ్.. షైనింగ్ ఔట్ ఫిట్ లో స్టైలిష్ పోజులు

- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎంత ఫేమసో అందరికీ తెలిసిందే. ఇక బన్నీ భార్య అల్లు స్నేహా రెడ్డి కూడా పాపులరే. స్నేహా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తరచూ ఫొటోషూట్స్ చేస్తూ ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుంది. ఇక అప్పుడప్పుడు తన ఫ్యామిలీ, పిల్లల ఫొటోలు పోస్టు చేస్తుంది. తాజాగా స్నేహా తన లేటెస్ట్ ఫొటో షూట్ కు సంబంధించిన ఫొటోలు షేర్ చేసింది.

ఈ ఫొటోల్లో స్నేహా రెడ్డి గోల్డెన్ క్రాప్ టాప్, బ్లాక్ లాంగ్ స్కర్ట్ లో కనిపించింది. ఈ ఔట్ ఫిట్ లో స్నేహా బాలీవుడ్ హీరోయిన్ ను తలపిస్తోంది. మెస్మరైజింగ్ పోజులతో, క్యూట్ స్మైల్ తో స్నేహ మది దోచేసింది. ఇక స్నేహ ఎంత ఫిట్ గా ఉంటుందో కొత్తగా చెప్పనక్కర్లేదు. అప్పుడప్పుడు తన ఫిట్ నెస్ వీడియోలు, ఫొటోలు కూడా షేర్ చేస్తూ ఉంటుంది.

- Advertisement -

స్నేహ లేటెస్ట్ ఫొటోలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఎంతైనా మన ఐకాన్ స్టార్ వైఫ్ అంటే ఆ మాత్రం స్టైలిష్ గా ఉంటుందిగా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆమె హీరోయిన్ కు ఏ మాత్రం తీసిపోదంటు మరికొందరు అంటున్నారు. ఇక ఇంకొందరైతే స్నేహ మోడలింగ్, సినిమాల్లోకి రాలేదు.. వచ్చినట్లయితే చాలా మందికి అవకాశాలు చేజారిపోయేవంటూ తెగ పొగిడేస్తున్నారు.

ఇక స్నేహా రెడ్డికి ఎంటర్ టైన్మెంట్ ఇండస్ట్రీలోకి రావాలని, మోడలింగ్ చేయాలని చాలా ఉండేదట. అయితే బన్నీ ఇప్పటికే ఇదే ఇండస్ట్రీలో ఉండటంతో ఇద్దరూ ఉంటే టైం స్పెండ్ చేయడానికి కుదరదని తను విరమించుకుందట. అయితే తన ప్యాషన్ ను మాత్రం ఇలా తరచూ ఫొటో షూట్లు చేస్తూ నెరవేర్చుకుంటుంది. మరోవైపు స్నేహా పీక్ ఏ బూ అనే స్టార్టప్ కంపెనీ కూడా ప్రారంభించింది. ఇది ఓ ఫొటో స్టూడియో.

 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here