IBomma: ఇటీవల కాలంలో ఏ కొత్త సినిమా వచ్చినా హెడీ క్వాలిటీలో వెంటనే ఐ బొమ్మలో ప్రత్యక్షం అవుతుంది. దీంతో ప్రేక్షకులు ఈ మధ్యకాలంలో చాలామంది థియేటర్లకు వెళ్లడమే మానేశారు. ఓటీటీ కోసం కూడా ఎదురు చూడకుండా వెంటనే నెట్లో ఐ బొమ్మ వెబ్ సైట్ ఓపెన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఐ బొమ్మ లో సినిమాలు చూస్తే తమకు భారీగా నష్టం వస్తుందని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గగ్గొలు పెడుతోంది. ఈ నేపథ్యంలో ఐ బొమ్మ సామాన్యులను దృష్టిలో పెట్టు్కుని… తెలుగు ఫిలిం ఇండస్ట్రీ (TFI) కి వార్నింగ్ ఇస్తూ బహిరంగ లేఖ విడుదల చేసింది. ఇక ఆ లేఖలో ఏముందో చూద్దాం.. ఐ బొమ్మ మీద మీరు ఫోకస్ చేస్తే.. మేం ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం.. డిస్ట్రిబ్యూటర్స్ కి ప్రింట్స్ అమ్మిన తర్వాత మీరు ఏమి పట్టనట్టు.. కెమెరా ప్రింట్స్ తీసిన వాళ్ల మీద కాకుండా మీ ఓటీటీ రెవెన్యూ కోసం ఆలోచిస్తూ మా మీద ఫోకస్ పెట్టారు. ఇక మీ సినిమాల్లో నటించే హీరోలకి అంత రెమ్యునరేషన్ అవసరమా ? అది మీ కొడుకు అయినా? ఎవరైనా సరే.. సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు.. వాళ్లు ఏమైపోతారు. వాళ్లకు మీరు ఇచ్చే అమౌంట్ ఏ కూలి పనికి వెళ్లినా వస్తుంది. కానీ మీ హీరోకి.. హీరోయిన్ కి వస్తాయా? సినిమా బడ్జెట్లో ఎక్కువ శాతం హీరోల రెమ్యునరేషన్, విదేశాలలో షూటింగ్ లకు ఖర్చు పెడుతున్నారు.
ప్రొడక్షన్ బాయ్స్ నుంచి లైట్ బాయ్స్ వరకు మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు? ఇండియాలో షూటింగ్ చేస్తే సినిమా బడ్జెట్ చాలా తగ్గుతుంది. దాంతో పాటు అక్కడ వాళ్లకి ఉపాధి కూడా కలుగుతుంది కదా..? ఫస్ట్ వేరే కెమెరా ప్రింట్స్ రిలీజ్ చేసే వెబ్సైట్ ల మీద మీ దృష్టి పెట్టండి.. ఐ బొమ్మ అన్నది సిగరెట్ నుంచి ఈ – సిగరెట్ కు యూజర్స్ ని మళ్లించే ప్రక్రియ.. మీ యాక్షన్ కి నా రియాక్షన్ ఉంటుంది. ఈ మధ్యలో వేరే ఏ హీరో కూడా టార్గెట్ అవడం ఇష్టం లేదు. మేం స్వతహాగా వెబ్సైట్ నుంచి తొలగిస్తున్నాం. ఇప్పుడు ఇమీడియట్ గా డిలీట్ చేస్తే మీకు భయపడి లేదా మీరు తీయించినట్టు ఉంటుంది. అందుకే ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల తర్వాత తీసివేయాలని అనుకుంటున్నాం. ఐ బొమ్మ వాళ్లు ఇండియాలో తీసివేసిన తర్వాత వాళ్లని రిక్వెస్ట్ చేసి టెక్నాలజీ షేర్ చేయాలని కోరాం. దానికి వాళ్లు కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు వాళ్లు కూడా షేర్ చేయడం లేదు. మేం ఐ బొమ్మ .నెట్ వాళ్లంతా మంచి వాళ్లం కాదు.. బురదలో రాయి వేయకండి.. పెంట మీద అసలు వేయకండి.. మేం ఏ దేశంలో ఉన్నా భారతదేశం అందులో తెలుగువారి కోసమే ఆలోచిస్తాం’ అంటూ ఐబొమ్మ విడుదల చేసిన లేఖలో పేర్కొంది.