ఈ చిత్రం లో నటించిన ఈ నలుగురు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారో చూస్తే నోరెళ్లబెడుతారు!

- Advertisement -

మన టాలీవుడ్ లో కొత్తవాళ్లతో తీసిన కొన్ని యూత్ ఫుల్ మూవీస్ మనకి ఎంతో బాగా కనెక్ట్ అవుతుంటాయి. వాళ్ళని ఆ సినిమాలో చూసినప్పుడల్లా మనల్ని మనం చూసుకున్నట్టుగా అనిపిస్తుంది. బోర్ కొట్టిన ప్రతీ సారీ టైం పాస్ కోసం ఆ సినిమాలను చూస్తూ ఉంటాము. ఇక ఈ చిత్రం లో రాహుల్ రామకృష్ణ కాకుండా, నలుగురు కుర్రాళ్ళు హీరోలుగా నటించారు.

మొదటి సినిమా అయ్యినప్పటికీ కూడా వీళ్ళు ఎంతో చక్కగా నటించి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసారు. ఇక ఈ చిత్రం లో నటించిన ఈ నలుగురు కుర్రాళ్లు ప్రస్తుతం ఏమి చేస్తున్నారు, వీళ్ళ చేతుల్లో సినిమాలు ఉన్నాయా లేవా అనేది ఒకసారి చూద్దాము. ఇక ఈ చిత్రం లో మెయిన్ హీరోగా నటించిన ‘చై’ అసలు పేరు మెడిశెట్టి అభినవ్. చూసేందుకు ఎంతో సాఫ్ట్ గా కనిపించే ఈ కుర్రాడు, ఈ సినిమా తర్వాత ‘షికారు’ అనే చిత్రం చేసాడు.

హుషారు
హుషారు

గత ఏడాది విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ప్రస్తుతం ఆయన ‘మైల్స్ ఆఫ్ లవ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ ‘హుషారు’ సినిమా లో మరో హీరో గా నటించిన ‘తేజాస్’ పర్వాలేదు అనే రేంజ్ లో అవకాశాలు సంపాదించుకున్నాడు, ఈ చిత్రం తర్వాత ఆయన ఏకంగా పాయల్ రాజ్ పుట్ తో కలిసి RDX లవ్ అనే సినిమాలో నటించాడు, కమర్షియల్ గా ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు.

- Advertisement -

ఈ రెండు చిత్రాలకు ముందే ఆయన తెలుగు మరియు తమిళం బాషలలో పలు సినిమాల్లో హీరో గా నటించాడు, పెద్దగా వర్కౌట్ అవ్వలేదు, ప్రస్తుతానికి చేతిలో సినిమాలు లేక ఖాళీగానే ఉన్నాడు ఈ హీరో.ఇక ఈ సినిమాలో మూడవ హీరో గా నటించిన ధృవ్ కూడా అడపాదడపా సినిమాల్లో హీరో గా నటించాడు. రీసెంట్ గానే ఈయన నిఖిల్ హీరో గా నటించిన ‘18 పేజస్‘ అనే చిత్రం లో ముఖ్యపాత్ర పోషించాడు, ఈ సినిమా తర్వాత కూడా ఆయనకీ అవకాశాలు బాగానే ఉన్నాయి. ఇక ఈ సినిమాలో చివరి హీరోగా నటించిన తేజ్ కురపాటి పలు సినిమాల్లో సినిమాల్లో కమెడియన్ గా చేసాడు. ‘హుషారు’ చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ శ్రీ హర్ష కొనుగంటి తదుపరి చిత్రం ‘రౌడీ బాయ్స్’ లో కూడా కమెడియన్ గా చేసాడు కానీ ఆ చిత్రం ఇతనికి పెద్దగా సక్సెస్ ని తెచ్చిపెట్టలేకపోయింది. ప్రస్తుతానికి ఖాళీగానే ఉన్నాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here