Pawan Kalyan : ఎప్పుడైతే సోషల్ మీడియా జనాల్లోకి చొచ్చుకుపోయిందో మన లైఫ్ కంటే పక్క వాళ్ళ లైఫ్ ని పట్టించుకోవడమే పనిగా పెట్టుకున్నాం. మన లైఫ్ లో మనం ఏం చేస్తా్ం..? మన ప్రాబ్లమ్స్ ఏంటో..? ఎవరు పట్టించుకోరు కానీ.. మనకు మాత్రం పక్క వాళ్ల జీవితం ఎలా ఉంది.. వాళ్లు సంతోషంగా ఎందుకు ఉన్నారు.. వాళ్ల ఆనందాన్ని ఎలా చెడగొట్టాలి అన్న విషయంపై మాత్రం ఫుల్ కాన్సన్ట్రేషన్ చేస్తుంటారు జనాలు.

ఇటీవల వరుణ్ లావణ్య పెళ్లి ఇటలీలో ఎంత వైభవంగా జరిగిందో మనందరికీ తెలిసిందే.. చాలా హ్యాపీగా, ప్రశాంతంగా పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ కూడా హాజరయ్యారు. కానీ ఈ పెళ్లిలో మెగా ఫ్యామిలీ స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించింది. అందరూ వెడ్డింగ్ థీమ్స్ తో అద్దిరిపోయారు. అయితే పవన్ మూడో భార్య అన్నా లెజినోవా మాత్రం సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురవుతోంది. ఆమె మునుపుటి మీద కంటే కూడా బరువు బాగా పెరిగిపోయింది.

వరుణ్ – లావణ్య పెళ్లిలో మెగా కుటుంబం అంతా కలిసి ఓ ఫ్యామిలీ ఫోటో దిగింది . చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్, మెగా ఆడపడుచులు అందరూ కలిసి ఫోటోకు ఫోజులిచ్చారు. ఈ ఫోటోలో పవన్ భార్య సోఫాలో కూర్చుని ఉంటుంది. పక్కన సురేఖ చిరంజీవి కూడా ఉన్నారు. అయితే సురేఖ చిరంజీవి చాలా సన్నగా పవన్ భార్య మాత్రం భారీ ఖాయంతో సోఫాకి సగం వరకు సరిపోయినట్లు కనిపిస్తుంది. దీనితో కొందరు ఆకతాయిలు కావాలనే ఆమెను ట్రోల్ చేస్తున్నారు. డ్రమ్ముకు చీర కట్టినట్లు ఉందని కొందరు అంటుంటే.. అవును సోఫాకు సగం సరిపోయావ్ అంటూ హార్డ్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో పవన్ అభిమానులు కోపంతో వాళ్లు రివర్స్ కౌంటర్స్ వేస్తున్నారు.