#RRR చిత్రం తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ రేంజ్ టాలీవుడ్ ని దాటి పాన్ వరల్డ్ కి ఎగబాకిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఎన్టీఆర్ తో ఒక్క సినిమా చెయ్యడానికి టాలీవుడ్ నుండి హాలీవుడ్ దర్శకుల వరకు క్యూ కట్టేస్తున్నారు. ప్రస్తుతం కొరటాల శివ తో ‘దేవర’ అనే చిత్రం చేస్తున్న ఎన్టీఆర్, ఈ చిత్రం పూర్తి అవ్వగానే ప్రశాంత్ నీల్ తో చెయ్యబోయే సినిమా షూటింగ్ లో పాల్గొంటాడని అందరూ అనుకున్నారు.

కానీ ఆ సినిమా సెట్స్ లోకి అడుగుపెట్టే ముందే ఆయన బాలీవుడ్ లో ఒక క్రేజీ ప్రాజెక్ట్ చెయ్యబోతున్నాడు. ఆ చిత్రమే ‘వార్ 2’. ఈ సినిమాలో హ్రితిక్ రోషన్ తో తలపడే పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటించబోతున్నాడని చాలా రోజుల క్రితం ఒక వార్త వచ్చింది కానీ, దానిని అధికారికంగా ఎవ్వరూ ఇప్పటి వరకు ప్రకటించలేదు.

నేడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సెలెబ్రిటీలు అందరూ సోషల్ మీడియా లో శుభాకాంక్షలు తెలియచేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ యాక్షన్ హీరో హృతిక్ రోషన్ కూడా శుభాకాంక్షలు తెలిచేసాడు. కానీ చాలా డిఫరెంట్ స్టైల్ లో ఆయన ట్వీట్ వేసాడు. ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు మిత్రమా.యుద్దభూమి నీకోసం ఎదురు చూస్తూ ఉంది, మనం కలిసే వరకు సంతోషంగా జీవితాన్ని గడుపు’ అంటూ మూవీ స్టోరీ ని పరోక్షంగా చెప్తూ ఒక ట్వీట్ వేసాడు.

దీనితో ‘వార్ 2 ‘ లో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు అనే విషయం ఖరారు అయిపోయింది. అయితే ఈ సినిమా లో ఎన్టీఆర్ ఎలాంటి పాత్ర పోషించబోతున్నాడు. పాజిటివ్ రోల్ లేదా నెగటివ్ రోల్ అనేది త్వరలోనే తెలియనుంది. అయితే ఏ పాత్ర అయ్యినప్పటికీ ఎన్టీఆర్ కి మరో పాన్ ఇండియా క్రేజీ ప్రాజెక్ట్ లో నటించబోతున్నందుకు సంతోషం వ్యక్తం చేసున్నారు ఫ్యాన్స్.
Happy Birthday @tarak9999! Wishing you a joyous day and an action packed year ahead. Awaiting you on the yuddhabhumi my friend. May your days be full of happiness and peace
— Hrithik Roshan (@iHrithik) May 20, 2023
…until we meet 😉
Puttina Roju Subhakankshalu Mitrama 🙏🏻