Vani Viswanath : ‘ఘరానా మొగుడు’ సెకండ్ హీరోయిన్ వాణీ విశ్వనాధ్ ఇప్పుడు ఎలా తయారయ్యిందో చూస్తే హడలిపోతారు!

- Advertisement -

Vani Viswanath : ఆరోజుల్లో అందం మరియు అభినయం తో కుర్రకారులను పిచ్చెక్కిపోయేలా చేసిన హీరోయిన్స్ లో ఒకరు వాణీ విశ్వనాథ్.ఈమె తెలుగు , తమిళం , హిందీ మరియు మలయాళం భాషలకు కలిపి సుమారుగా 50 సినిమాల్లో నటించింది.తెలుగు లో ఆమె తక్కువ సినిమాలే చేసింది కానీ మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘ఘరానా మొగుడు’ చిత్రం లో సెకండ్ హీరోయిన్ గా నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించింది.

Vani Viswanath
Vani Viswanath

రోజుల్లో ఈ సినిమా ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే, రాఘవేంద్ర రావు దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా అప్పట్లోనే పది కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.ఇక రాఘవేంద్ర రావు తన సినిమాల్లో హీరోయిన్స్ ని ఎంత అందంగా చూపిస్తాడో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.వాణీ విశ్వనాధ్ ని కూడా ఆయన అదే రేంజ్ లో చూపించాడు.ముఖ్యంగా ‘చిటపట చినుకులు’ సాంగ్ లో వాణీ విశ్వనాథ్ అందాలను చూసి నేటితరం యువత కూడా ఫిదా అయ్యింది.

Vani Viswanath Photos

అలా కెరీర్ మంచిగా ముందుకు సాగిపోతూ ఉన్న సమయం లో మలయాళం హీరో బాబు రావు తో ప్రేమాయణం నడిపి అతనిని పెళ్లాడింది. ఇప్పుడు వీళ్లిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సినిమాల్లో గొప్పగా రాణించిన వాణీ విశ్వనాథ్ రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టింది. తెలుగు దేశం పార్టీ లో క్రియాశీలక సభ్యురాలిగా సేవలంచినప్పటికీ ఎలాంటి పదవులు ఆశించలేదు. అలా సినీ మరియు రాజకీయ జీవితాన్ని గడిపిన వాణీ విశ్వనాథ్ ఇప్పుడు ప్రస్తుతం అన్నిటికీ దూరంగా ఉంటూ సంసార జీవితం ని ప్రశాంతం గా గడుపుతుంది.

- Advertisement -
Vani Viswanath Stills

కానీ మంచి పాత్రలు వచ్చినప్పుడు మాత్రం అప్పుడప్పుడు వెండితెర మీద కనిపిస్తూ ఉంటుంది. ఈమె చివరిసారిగా మన తెలుగు సినిమాలో కనిపించింది ‘బోయపాటి శ్రీను‘ దర్శకత్వం లో వచ్చిన జయ జానకి నాయక చిత్రం. ఆ తర్వాత ఈమె మళ్ళీ ఏ తెలుగు సినిమాలోనూ కనిపించలేదు. అయితే ఆమె రీసెంట్ ఫోటోలను చూసిన అభిమానులు షాక్ కి గురయ్యారు. ఆమె వయస్సు దాదాపుగా 51 ఏళ్ళు ఉంటుంది. ఆమె వయస్సులో ఉన్న చాలామంది హీరోయిన్లు ఇప్పటికీ వర్కౌట్స్ చేస్తూ గ్లామర్ ని మైంటైన్ చేస్తున్నారు. కానీ వాణీ విశ్వనాథ్ ఎలా ఉందో మీరే చూడండి.

Vani Viswanath Latest photos
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here