రూట్ మార్చిన హనీరోజ్.. ఇకపై అవే వేసుకుంటాను.. కుర్రాళ్లకు పండగే

- Advertisement -

మలయాళ నటి హనీ రోజ్.. ఈ యేడాది బాలకృష్ణ హీరోగా నటించిన ‘వీరసింహారెడ్డి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. తెలుగులో గతంలో ఒకటి రెండు చిత్రాల్లో నటించిన పెద్దగా గుర్తింపు లభించలేదు. ఇక వీరసింహారెడ్డి మూవీతో ఒక్కసారి పాపులర్ అయింది. దీంతో ఈ భామ తెలుగు రాష్ట్రాల్లో మూడు కటింగ్‌లు ఆరు ఓపెనింగ్స్‌తో దూసుకుపోతుంది.అంతేకాదు తెలుగులో సీనియర్ హీరోలకు బెస్ట్ ఆప్షన్‌గా మారింది ఈ భామ.

హనీరోజ్
హనీరోజ్

వీరసింహారెడ్డి సినిమాతో హానీరోజ్‌కు కావాల్సినంత పాపులారిటీ రావడంతో ప్రస్తుతం తెలుగులో కూడా మంచి అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భామకు ఇటు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలతో పాటు అటు గ్లామర్ పాత్రలు కూడా వస్తున్నట్లు టాక్. కాకపోతే ఇప్పటి వరకు హనీ మాత్రం తన తర్వాత ప్రాజెక్ట్ లు ఏవీ ప్రకటించలేదు. బాలయ్య సినిమాలో రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించడం తో పాటు గ్లామర్ పరంగా కూడా తిరుగులేకపోవడంతో అభిమానులు ఆమెకి ఫిదా అవుతున్నారు. మతిపోయే షేపులతో హనీ రోజ్ యువతని ఆకర్షిస్తోంది. పాలరాతి శిల్పం లాగా ఉండే హనీ రోజ్.. అందాలు కూడా ఆరబోస్తోంది.

పాలరాతి హనీ రోజ్
పాలరాతి హనీ రోజ్

తాజాగా హనీ రోజ్ సోషల్ మీడియాలో మైండ్ బ్లోయింగ్ అనిపించే ఫోజులతో కళ్ళు చెదిరే ట్రీట్ ఇచ్చింది. ఎలాంటి డ్రెస్ ధరించినా హానీ రోజ్ చంద్రబింబం లాటి తాజా ముఖంతో, కుర్రాళ్ళని చూపు తిప్పుకోనీయని పరువాలతో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఈ ఫోజుల్లో ఆమె భారీ పరువాలు యువతకి కనువిందుగా మారాయి. భారీ స్ట్రక్చర్ తో ఈ హాట్ లేడీ యువతలో విరహం పెంచుతోంది. చిరునవ్వులు చిందిస్తూ ఆమె అలా నిలబడితే చాలు.. యువత మైకంలో మునిగిపోతారు. ఎప్పుడూ చీరలో కనిపించే ఈ అమ్మడు తాజాగా ఇలా కనిపించడంతో కుర్రాళ్లు ఇకపై ఇవే వేసుకోమంటూ సలహాలు ఇస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here