Chiranjeevi : ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ కి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి.. ఏ రంగానికి చెందిన వారైనా ఆయనని ఆదర్శంగా తీసుకుంటే కెరీర్ లో ఉన్నతస్థాయికి వెళ్తారు..అలా వెళ్లిన వాళ్ళ సంఖ్య లక్షల్లోనే ఉంటుంది..అంతలా ప్రభావితం చేసిన వ్యక్తి ఆయన..కేవలం ఒక సినీ నటుడిగా మాత్రమే కాదు..సేవ చెయ్యడం లో కూడా చిరంజీవి ఎంతో మందికి స్ఫూర్తిదాయకం..తన శత్రువు మంచిని కోరుకునే ఏకైక మనిషిగా కూడా చిరంజీవి కి ఇండస్ట్రీ లో పేరుంది.
గతం లో మనం ఎన్నో ఉదాహరణలు చూసాము..మీడియా ముందు కూర్చొని చిరంజీవిని ఇష్టమొచ్చినట్టు తిట్టినవారే ఆయన సహాయం అందుకున్న సందర్భాలు ఉన్నాయి..ఉదాహరణకు హీరో రాజశేఖర్ ని తీసుకుందాం..ప్రజారాజ్యం పార్టీ పెట్టిన కొత్తల్లో తన భార్య జీవిత తో కలిసి ఇతగాడు చేసిన రచ్చ ని అంత తేలికగా ఎవ్వరూ మరచిపోలేము..కానీ ఆ తర్వాత ఇతను కూడా చిరంజీవి సహాయం కోసం ఆయన ఇంటి గడప తొక్కిన రోజులు ఉన్నాయి.
రాజశేఖర్ కుమార్తె కి మెడికల్ సీట్ ఇప్పించింది కూడా చిరంజీవే..ఈ విషయాన్నీ స్వయంగా రాజశేఖర్ చెప్పుకొచ్చాడు..అంతే కాదు రాజశేఖర్ కి కరోనా సోకిన విషయం మన అందరికీ తెలిసిందే..ప్రాణాలు పొయ్యేంత సీరియస్ గా ఆయన ఆరోగ్యం విషమించింది..ఆ సమయం లో రాజశేఖర్ కి మెరుగైన వైద్యం అందేలా చేసింది చిరంజీవే..విదేశాల నుండి ప్రత్యేక వైద్య బృందం ని ఇక్కడకి రప్పించి ఆయనకీ మెరుగైన వైద్యం అందేలా చేసి ప్రాణాపాయం నుండి కాపాడాడు.
ఇలా ఒక్కటా రెండా ఆయన చేసిన మంచి పనులు చెప్పుకుంటూ పోతే ఒక్క రోజు సరిపోదు..చిరంజీవి చిరకాల మిత్రుడు/తమిళనాడు స్టార్ హీరో శరత్ కుమార్ కూడా తనకి ఆరోజుల్లో చిరంజీవి చేసిన సహాయం గురించి చెప్పుకొచ్చాడు..అప్పట్లో ఒక సినిమాని నిర్మించి భారీగా నష్టపోయానని,మొత్తం అప్పులపాలై జీవితం మనుగడ సాగించడమే కష్టం అవుతున్న రోజుల్లో నాకు ఒక నిర్మాత చిరంజీవి డేట్స్ ఇప్పిస్తే వచ్చిన లాభాల్లో నీకు వాటా ఇస్తానని చెప్పాడని.
ఇదే విషయం చిరంజీవి గారికి చెప్తే ఆయన రెమ్యూనరేషన్ కూడా తీసుకోకుండా మా సినిమాకి డేట్స్ ఇచ్చారని.. అది సూపర్ హిట్ అయ్యి బాగా లాభాలు రావడం తో నా అప్పులు మొత్తం తీర్చేసుకున్నాను అంటూ శరత్ కుమార్ చాలా ఎమోషనల్ గా ఒకసారి చెప్తాడు.. అలా చిరంజీవి ద్వారా సహాయం పొందిన హీరోలు.. ఆర్టిస్టులు ఎంతో మంది ఉన్నారు.. కానీ ఎప్పుడూ ఆయన ఇవన్నీ బయటకి చెప్పుకోడు, ఎవరైనా చెప్తేనే తెలుస్తాయి.
అలాగే 1980లో సినిమా పరిశ్రమలో కెమెరామెన్ గా వెలుగు వెలిగిన దేవరాజ్ ప్రస్తుతం ఆర్ధిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారు. ఈ విషయం మెగాస్టార్ చిరంజీవి వరకు చేరింది. ఈ నేపథ్యంలో దేవరాజ్ ని తన నివాసానికి పిలిపించుకొని, చక్కటి ఆతిథ్యం ఇచ్చి ఆయన పరిస్థితి గురించి తెలుసుకున్నాడు. తన వంతుగా రూ. 5 లక్షలు ఆర్థికసాయం చేశారు. ఇకపై ఆయన కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. దేవరాజ్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘నాగు’, ‘పులిబెబ్బులి’, ‘రాణి కాసుల రంగమ్మ’ లాంటి సినిమాలకు దేవరాజ్ కెమెరామెన్ గా పని చేశారు.
ఇటీవలే విడుదలైన వాల్తేరు వీరయ్య సినిమా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ద్వారా చిరంజీవి రికార్డులు సృష్టించాడు.