Heroines : అవ్వా.. భర్తతో పబ్లిక్గా ఆ పని చేసిన హీరోయిన్లు.. ఫోటోలతో రచ్చ..



Heroines : ఒకప్పుడు సినిమాల్లో మాత్రమే గ్లామర్ షో చేసేవారు.. కానీ ఇప్పుడు సందు దొరికితే ఏదోక ఫోటోను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు.. అందరికన్నా భిన్నంగా ఆలోచించింది శ్రీయ.. భర్తకు లిప్ లాక్ ఇస్తు చెలరేగిపోయింది. ప్రస్తుతం ఈ లిప్ లాక్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద హీరోలందరి సరసన నటించి.. మంచి నటిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పెళ్లి తర్వాత క్రమంగా సినిమాలు తగ్గించిన శ్రియా.. అడపా దడపా సినిమాలు చేస్తూ వస్తోంది.

Shreya and Andreev Koshchev
Shreya and Andreev Koshchev

ఇక శ్రియా సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్ గా ఉంటుంది అన్న విషయం మనందరికి తెలిసిందే. తన పాపతో, భర్తతో కలిసి బీచ్ లో ఫొటోలతో, వీడియోలతో రచ్చ రచ్చ చేసే విషయం తెలియంది కాదు. అయితే ఈ సారి ఏకంగా దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీలో మీడియా ముందే తన భర్త అండ్రివ్ కొశ్చేవ్ కు లిప్ లాక్ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది. ఓ కార్యాక్రమానికి హాజరైంది శ్రీయ..ఈ క్రమంలో అక్కడున్న విలేకరులు మేడం మీ భర్తకు ఓ ముద్దు పెట్టండి అని అడగడంతో. ముసి ముసి నవ్వులు నవ్వుతూ లిప్ లాక్ ఇచ్చింది. ఆ లిప్ లాప్ ఫోటో నెట్టింట దుమారం రేపింది..

Priyanka Chopra
Priyanka Chopra

ప్రియాంక చొప్రా.. బాలివుడ్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు..సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ప్రియాంక చోప్రా.. తరచూ తన భర్తతో చేసిన రొమాన్స్ తాలూకు ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ సీనియర్ హీరోయిన్ ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు తన భర్త నిక్ జోనస్‌ అడగ్గానే లిప్ కిస్ చేసింది. దీంతో ఇది తక్కవు టైంలోనే వైరల్ అవుతోంది..

Kajal Agarwal
Kajal Agarwal

కాజల్ అగర్వాల్.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది..ముంబైకి చెందిన వ్యాపార వేత్త గౌతమ్‌ కిచ్లును వివాహం చేసుకుంది.2020లో వివాహం చేసుకున్న ఈ జంట ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్‌ చేస్తోంది. పూర్తి సమయాన్ని భర్త, కుమారుడితో స్పెండ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఫ్యామిలీతో కలిసి దిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా క్రిస్మస్‌ సందర్భంగా కుమారుడు, భర్తతో దిగిన ఫొటోను కాజల్‌ షేర్‌ చేసింది. గౌతమ్‌ కుమారుడిని ఎత్తుకోగా, మరో వైపు కాజల్‌ భర్తకు ముద్దు ఇస్తుండగా తీసిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది..వీరితో పాటు చాలా మంది ఉన్నారు..కానీ వీళ్ళ ఫోటోలు మాత్రం నెట్టింట వైరల్ అవుతున్నాయి..