Tina Shilparaj : మొదటి సినిమాతోనే ప్రేక్షకులను అలరించడం, అశేష ప్రేక్షకాదరణ పొందడం అనేది అంత సాధారణమైన విషయం కాదు, ముఖ్యంగా హీరోయిన్స్ విషయం మాట్లాడుకోవాలి. ఎంత టాలెంట్ , అందం ఉన్నప్పటికీ అదృష్టం లేకపోతే మొదటి సినిమానే చివరి సినిమా అయ్యే ప్రమాదం ఉంది.ఇది వరకు ఇలాంటి సందర్భాలు చాలా జరగడం మన కళ్ళతోనే చూసాము, కానీ మొదటి సినిమాతోనే ఈమె కచ్చితంగా స్టార్ హీరోయిన్ అయిపోతుంది అని అనిపించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వారిలో ఒకరు టీనా శిల్పరాజ్.

సుహాస్ హీరో గా రీసెంట్ గా విడుదలైన ‘రైటర్ పద్మభూషణ్’ చిత్రం లో హీరోయిన్ గా నటించిన ఈమెకి మొదటి సినిమాతోనే మామూలు రేంజ్ క్రేజ్ రాలేదు.నటన పరంగా , అందం పరంగా ఎవరీ అమ్మాయి ఇంత చక్కగా ఉంది అని అనిపించేలా చేసింది.ఈ సినిమా భారీ హిట్ అవ్వడం తో ఆమె ఇప్పుడు దాదాపుగా మూడు సినిమాల్లో హీరోయిన్ గా నటించే అవకాశం కొట్టేసింది.

టీనా శిల్పరాజ్ హైదరాబాద్ కి చెందిన అమ్మాయి, ఆమె పుట్టి పెరిగింది మరియు చదువుకున్నది అంతా ఇక్కడే.ఆహా మీడియా లో పెద్ద సూపర్ హిట్ గా నిలిచినా ‘బేకర్స్ అండ్ బ్యూటీ’ వెబ్ సిరీస్ లో హీరోయిన్ గా నటించి మంచి పేరు తెచ్చుకుంది.ఇందులో ఆమె పోషించిన ఐరా పాత్రని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు.

ఆ సిరీస్ లో ఆమె నటన చూసి షణ్ముఖ ప్రశాంత్ ఎంతగానో ఆకర్షితుడై తానూ తియ్యడబోతున్న ‘రైటర్ పద్మభూషణ్‘ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం ఇచ్చాడు. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వడం తో ఇక టీనా కి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదనే అనుకోవచ్చు. అయితే సోషల్ మీడియా లోని ఇంస్టాగ్రామ్ అకౌంట్ తో అభిమానులతో టచ్ లో ఉండే టీనా శిల్పరాజ్ రీసెంట్ గా అప్లోడ్ చేసిన కొన్ని ఫోటోలు కుర్రకారుల్ని మెంటలెక్కిపొయ్యేలా చేస్తున్నాయి.. ఆ ఫోటోలను మీరు కూడా చూసేయండి.






