రూ.100 కోట్లు ఇచ్చినా అలాంటి పాత్రలు చేయను.. తేల్చి చెప్పిన శ్రీలీల

- Advertisement -

టాలీవుడ్‌లో ప్రస్తుతం గట్టిగా వినిపిస్తున్న హీరోయిన్ పేరు శ్రీలీల. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్లి సందడి’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ.. తొలి సినిమాతోనే కుర్రకారుకు వల వేసింది. ఆ తరవాత ‘ధమాకా’లో రవితేజ సరసన నటించి దుమ్ములేపింది. ఈ సినిమాతో శ్రీలీలలోని కమర్షియల్ యాంగిల్ బయటపడింది. మంచి నటన, డాన్స్‌లో మంచి ప్రతిభ, ఆకట్టుకునే అందం శ్రీలీలకు ప్లస్ పాయింట్లుగా మారాయి. దీంతో ప్రస్తుతం ఆమె వరుసపెట్టి అవకాశాలు దక్కించుకుంటుంది.

శ్రీలీల
శ్రీలీల

ప్రస్తుతం శ్రీలీల చేతిలో సుమారు 8 సినిమాలు ఉన్నాయి. వీటిలో ఏడు తెలుగు సినిమాలే కావడం విశేషం. బోయపాటి శ్రీను, రామ్ పోతినేని కాంబినేషన్‌లో వస్తోన్న మూవీలో శ్రీలీల హీరోయిన్. నితిన్ 32వ సినిమాలోనూ ఈమే లీడ్ రోల్ చేస్తోంది. నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తోన్న ‘భగవంత్ కేసరి’లో శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోంది. బాలయ్య కూతురు పాత్ర అని సమాచారం. ఇక మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న ‘గుంటూరు కారం’లో సూపర్ స్టార్‌తో ఆడిపాడుతోంది. విజయ్ దేవరకొండ 12వ సినిమా, పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. శ్రీలీల ఖాతాలో ఉన్న మరో రెండు పెద్ద ప్రాజెక్టులు. మొత్తం మీద ఈ సినిమాలు పూర్తయ్యే సరికి శ్రీలీలకు స్టార్ హీరోయిన్ హోదా వచ్చేస్తుంది.

అయితే శ్రీలీల ఎంత అందంగా ఉంటుందో అంత కమిట్మెంట్ గల వ్యక్తి అంటూ డైరెక్టర్స్ మేకర్స్ చెప్పుకొస్తున్నారు . అంతేకాదు శ్రీ లీలా కమిట్ అయిన పది సినిమాలను కచ్చితంగా ఆరు సినిమాలు హిట్ అయే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి . కాగ రీసెంట్గా శ్రీలీల వద్దకు ఓ స్టార్ డైరెక్టర్ బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాను తీసుకెళ్లారట . అంతేకాదు 10 కోట్ల పారితోషకాని ఇస్తాం.. ఈ సినిమాలో నటించమంటూ బలవంతం చేశారట . అయితే 10 కోట్లు కాదు 100 కోట్లు ఇచ్చిన అలాంటి బోల్డ్ కంటెంట్ సినిమా చేయను అంటూ తెగేసి చెప్పకు వచ్చిందట శ్రీ లీల .

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here