ఎప్పుడూ చీర లో కనిపించే Raasi ఇలాంటి బట్టలు వేసుకుందేంటి..! లేటెస్ట్ ఫొటోస్ చూస్తే మెంటలెక్కిపోతారు

- Advertisement -

Raasi అచ్చ తెలుగు అమ్మాయి గా ఇండస్ట్రీ లో అడుగుపెట్టి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో రాశీ కచ్చితంగా ఉంటుంది.బాల నటిగా కెరీర్ ని ప్రారంభించిన ఈమె తమిళం లో విజయ్ హీరో గా తెరకెక్కిన ‘లవ్ టుడే’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.ఆ సినిమా పెద్ద హిట్టైన తర్వాత ఈమెకి తెలుగు లో మరియు తమిళం లో వరుసగా ఆఫర్లు వచ్చాయి.

Raasi
Raasi

తన తోటి హీరోయిన్స్ లాగా అందాల ఆరబోతకు ఏమాత్రం తావు ఇవ్వకుండా, సంసారపక్షంగా ఉండే పాత్రలు చేస్తూ, ఇండస్ట్రీ లో నటనతో కూడా నెగ్గుకురాగలను అని నిరూపించింది.సుమారుగా 70 సినిమాల్లో హీరోయిన్ గా నటించి ప్రేక్షాభిమానం పొందిన రాశీ, పెళ్లి తర్వాత క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ కి షిఫ్ట్ అయ్యింది.అందులో కూడా ఈమె గొప్పగా రాణించింది.

ఎప్పుడూ సాఫ్ట్ పాత్రలతోనే నెట్టుకొచ్చిన రాశీ , మహేష్ బాబు హీరో గా నటించిన ‘నిజం’ సినిమాలో విలన్ గా కూడా నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.చివరిసారిగా ఆమె వెండితెర మీద కనిపించిన చిత్రం ‘లంక’.ఈ చిత్రం తర్వాత ఆమె మళ్ళీ సినిమాల్లో కనిపించలేదు కానీ రీసెంట్ గానే స్టార్ మా ఛానల్ లో సూపర్ హిట్ గా నిల్చిన ‘జానకి కలగనలేదు’ అనే సూపర్ హిట్ సీరియల్ లో హీరో కి తల్లిపాత్ర పోషించి మంచి మార్కులు కొట్టేసింది.ఈ సీరియల్ ప్రస్తుతం స్టార్ మా లో మంచి టీఆర్ఫీ రేటింగ్స్ తో ముందుకు దూసుకుపోతుంది.

- Advertisement -

ఇది ఇలా ఉండగా రాశీ ఇన్నేళ్ల తన సినీ కెరీర్ లో ఏ సినిమా లో కూడా ఆమె మోడరన్ డ్రెస్ లు వేసుకోవడం మనం చూడలేదు.విచిత్రం ఏమిటంటే ‘రంగస్థలం‘ సినిమాలో రంగమ్మ అత్త పాత్ర తొలుత రాశీ కి వచ్చింది.కానీ అందులో కాళ్ళు ఎక్సపోజ్ చెయ్యాలనే కారణం చేత ఆ పాత్ర ని రిజెక్ట్ చేసింది.అలాంటి ఆమె లేటెస్ట్ గా మోడరన్ డ్రెస్ తో దిగిన కొన్ని ఫోటోలను చూసి ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అయ్యింది.ఆ ఫోటోలను మీరు కూడా చూసేయండి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here