Pooja Hegde : తన అందచందాలతో పాటు నటన ప్రతిభ చూపిస్తూ మెల్లగా స్టార్ స్టేటస్ పట్టేసింది పూజా హెగ్డే (pooja hegde). ఒక లైలా కోసం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై యూత్ ఆడియన్స్ మనసు దోచుకుంది. తొలుత మోడలింగ్ చేసి ఆ తర్వాత సినీ గడప తొక్కిన ఈ భామ టాలీవుడ్, బాలీవుడ్ తెరలపై రాణిస్తోంది. తాజాగా సల్మాన్ తో కలిసి ఓ సినిమాలో నటించింది.

బాలీవుడ్ నీళ్లు ఈ భామకు బాగా ఒంటపట్టినట్లు ఉన్నాయి. అందాల అరబోతలో డోస్ పెంచేసింది. బీ టౌన్ సినిమాలకు ఓకే చెప్పిన దగ్గర నుంచి తరచుగా గ్లామరస్ ఫోటో షూట్స్ షేర్ చేస్తూ హాట్ అందాలతో కుర్రకారుకు చెమటలు పట్టిస్తోంది ఈ అందాల తార. దీంతో ఆన్ లైన్ మాధ్యమాలపై ఎక్కడ చూసినా పూజా ఫొటోలే దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోస్ అగ్గి రాజేస్తున్నాయి. తన సోషల్ మీడియా ఖాతా ద్వారా హాట్ లుక్స్ వదిలింది పూజా.

నూలు పోగులతో ప్రత్యేకంగా తయారు చేయించిన డ్రెస్ వేసుకుని వగలు పోతూ ఫొటోలకు పోజులు ఇచ్చింది. ఈ పొడుగు కాళ్ల సుందరి కాళ్లన్నీ కనిపించాలని కావాలని ఫొటోలు దిగింది. ఇవి చూసిన నెటిజన్లు బాలీవుడ్ కు వెళ్లాక భామలో చాలా మార్పు వచ్చిందని గుసగుసలాడుకుంటున్నారు. కొందరేమో సల్మాన్ కోసమేనా ఇదంతా అంటూ డిఫరెంట్ స్టైల్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది పూజా హెగ్డే. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో కిసీకా బాయ్ కిసీజా జాన్ సినిమా చేస్తోంది. ఈ రెండు సినిమాలపై ఎన్నో ఆశలు పెట్టుకుంది ఈ బుట్టబొమ్మ.