Neha Sharma : పాలిటిక్స్ లోకి దిగుతున్న ‘చిరుత’ బ్యూటీ.. ఇక ప్రతిపక్షాలు పరారే

- Advertisement -

Neha Sharma : హీరోయిన్ నేహా శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రామ్ చరణ్ డెబ్యూ మూవీ ‘చిరుత’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో తన అందం, యాటిట్యూడ్‌తో యూత్‌ని కట్టిపడేసింది ఈ అమ్మడు. కానీ, ఈ క్రేజ్ ఎక్కువ కాలం టాలీవుడ్ ఇండస్ట్రీలో నిలవలేకపోయింది. చిరుత తర్వాత తెలుగులో వరుణ్ సందేశ్ తో కలిసి ‘కుర్రాడు’ అనే సినిమాలో మాత్రమే నటించిన ఆమె.. ఆ తర్వాత టాలీవుడ్‌కి దూరంగా బాలీవుడ్, తమిళం, మలయాళం సినిమాల్లో నటించింది. నేహా శర్మ మాత్రం నటనలో పర్వాలేదు అనిపించినా ఎందుకో అనుకున్నంత స్టార్ డమ్ అందుకోలేకపోయింది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు రాబోయే ఎలక్షన్ల ద్వారా రాజకీయాల్లోకి రానున్నట్లు తెలుస్తోంది.

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో నేహాశర్మ పోటీ చేయనున్నట్లు సమాచారం. ఆమె బీహార్ నుంచి పోటీ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా నేహా శర్మ తండ్రి, కాంగ్రెస్ నేత అయిన అజిత్ శర్మ తెలిపారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘భాగల్‌పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు మంచి పట్టు ఉంది. ఇండియా కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా ఈ సీటు కాంగ్రెస్ కు దక్కాలి. దీనిపై చర్చలు జరుగుతున్నాయి.. ఈ సీటు కాంగ్రెస్‌కు దక్కితే.. నేను లేదా నా కూతురు నేహా శర్మ పోటీ చేస్తాం.’’ అన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నేహా శర్మ పొలిటికల్ ఎంట్రీపై అభిమానులు షాక్ అవుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here