Chiranjeevi : శ్రీకాంత్ ఇంటికి వెళ్లి మరీ ఆ పని చేసిన చిరంజీవి.. షాక్ అవుతున్న ఫ్యాన్స్

- Advertisement -

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి గురించి, ఆయన మంచి మనసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ప్రస్తుతం దానికి పెద్ద దిక్కుగా మారాడు. ప్రస్తుతం ఇండస్ట్రీకి ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ ముందుంటున్నాడు. ఇండస్ట్రీలో తన అనుకున్న వారిని దగ్గరుండి చూసుకుంటారు చిరంజీవి. చిరుకు మొదటి నుంచి ఓ ప్రత్యేక అలవాటు ఉంది. తను అనుకున్న వారి పుట్టిన రోజున అతను వారి ఇంటికి వెళ్లి మరీ వారి పుట్టినరోజును జరుపుతుంటారు. ఇలా ఎంతో మంది సెలబ్రిటీల ఇళ్లకు వెళ్లి పుట్టినరోజు జరుపుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. చిరు ఇటీవల హీరో శ్రీకాంత్ పుట్టినరోజును జరుపుకున్నారు. వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

చిరు- శ్రీకాంత్ కలిసి శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో నటించారు. ఏటీఎంగా శ్రీకాంత్ నటనను అభిమానులు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. చిరు ఫ్యామిలీకి శ్రీకాంత్ సన్నిహితుడని చెప్పొచ్చు. శ్రీకాంత్ కు చిరు సినిమాలోనే కాదు బయట కూడా పెద్ద అన్నయ్య లాంటోడని చెప్పొచ్చు. ఇక ఈరోజు శ్రీకాంత్ పుట్టినరోజును పురస్కరించుకుని స్పెషల్ కేక్ తీసుకుని చిరు శ్రీకాంత్ ఇంటికి వెళ్లి .. కేక్ కట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి. ఈ ఫోటోల్లో శ్రీకాంత్ తనయుడు రోషన్ కూడా ఉన్నాడు. శ్రీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు. రామ్ చరణ్ శంకర్ కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్ చిత్రంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here