Namitha : నిర్మాత చేతిలో దారుణంగా మోసపోయిన స్టార్ హీరోయిన్.. సంచలన విషయాలు వెల్లడి

- Advertisement -

Namitha : హీరోయిన్‌ నమిత.. ఈపేరుతో పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. సొంతం సినిమాతో హీరోయిన్‎గా టాలీవుడ్‌ ఇండస్ట్రీకి అడుగుపెట్టింది. ఇక ఈ సినిమాలో తన నటన, అద్భుతమైన అందంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. దీని తర్వాత వెంకటేష్ జెమిని మూవీలో నటించి మంచి పాపులరిటీ దక్కించుకుంది. ఇలా ఈ ముద్దుగుమ్మ చేసింది తక్కువ సినిమాలే అయినా.. అతి తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో మంచి క్రేజీ హీరోయిన్‌ గా పేరు తెచ్చుకుంది. కానీ అందం నటన ఉన్న అమ్మడికి అదృష్టం కలిసి రాలేదు. సినిమాల్లో అవకాశాలు కరువయ్యాయి. దీంతో హీరోయిన్‌ గా ఇండస్ట్రీలో నమిత కనుమరుగయింది. కొన్నేళ్ల తర్వాత ప్రభాస్ బిల్లా సినిమాలో, అలాగే బాలకృష్ణ సింహా సినిమాలో నటించి అలరించింది.

అయితే తెలుగులో కన్నా.. తమిళ్‌ లోనే ఆమె ఎక్కువ సినిమాల్లో నటించింది. కాగా,తమిళనాట ఈమె విజయకాంత్‌ మా అన్న చిత్రంతో అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే.. దిగన్, ఇంగ్లీస్ఖరన్, చాణకియ, బంబారా కన్నాలే, కోయంబత్తూర్ బ్రదర్స్, పచ్చ ఉద్దీ, అజ్జయ తమిళ్ మగన్ వంటి సినిమాల్లో నటించింది. అలా తెలుగు, తమిళంలో మంచి ఆదరణ తెచ్చుకున్న నమిత ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది.

- Advertisement -

నమిత మాట్లాడుతూ.. ధనుష్ సినిమాలో కాల్షీట్లు అడిగి ఒక నిర్మాత మోసం చేశాడంటూ చెప్పింది. కాగా, 2006లో ఓ సినిమాలో నన్ను హీరోయిన్ గా నటించమని అడిగారు. ఇక ఆ సినిమా పేరు చెప్పనక్కర్లేదు, ఆ సినిమా నిర్మాత.. ఈ సినిమాలో ధనుష్‌ సరసన నేను నటించాలని నా దగ్గర కాల్షీట్లు తీసుకున్నాడు. కానీ ఆఖరికి నిర్మాత కజిన్‌ ఆ సినిమాలో హీరోగా నటించాడు. ఆ విషయం తెలియగానే చాలా బాధపడి సగంలోనే సినిమా నుంచి బయటకు వచ్చేశాను. ఆపై ఎలాగోలా సినిమా పూర్తి చేసి విడుదల చేశారు. అయితే ఈ విషయం మీద అప్పట్లో నిర్మాతల మండలికి, నటీనటుల మండలికి ఫిర్యాదు చేశాను’ అంటూ నమిత చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here