Guess Who : ఈ ఫోటోలో ఎన్టీఆర్ ను కౌగిలించుకున్న మహిళ ఎవరో గుర్తు పట్టారా ?

- Advertisement -

Guess Who : సీనియర్ ఎన్టీఆర్ పోలికలతో పాటు నటవారసత్వాన్ని కూడా అందిపుచ్చుకున్నారు ఎన్టీఆర్. వరుస సినిమాలతో హిట్స్ కొడుతూ టాలీవుడ్ టాప్ హీరోగా ఎదిగారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ కు జోడీగా అందాలతార జాన్వీ కపూర్ నటిస్తున్నారు. కాగా ఇటీవలె ఎన్టీఆర్ తన పుట్టిన రోజు జరుపుకున్నారు.

ఆయన పుట్టిన రోజు వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించారు. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఎన్టీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే, ఈ క్రమంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ ఫొటోలో ఎన్టీఆర్ తో ఒక మహిళ చనువుగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఆమె ఎవరని అందరూ నెట్లో సెర్చ్ చేస్తున్నారు.

- Advertisement -

ఆమె ఎవరో కాదు పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సతీమణి లిఖితా రెడ్డి. ఈ ఏడాది మార్చిలో ఎన్టీఆర్, తన భార్యతో కలిసి బెంగళూరు వెళ్లాడు. ప్రశాంత్ నీల్ ఇంట్లో అందరూ కలిసి బర్త్ డే పార్టీ చేసుకున్నారు. వారందరూ సరదాగా ఆ పార్టీలో ఫొటోలు దిగారు. అప్పుడు తీసుకున్న ఫొటోల్లో ఒకటే ఇది. ఇప్పుడు ఆమె ఈ ఫోటోని పోస్ట్ చేసి ఎన్టీఆర్ కు బర్త్ డే విషెస్ తెలిపింది. ఈమెకు ఎన్టీఆర్ అంటే అమితమైన ఇష్టమట. ఖాళీగా ఉన్నప్పుడల్లా అతడి సినిమాలే చూస్తుందట. ఈ నేపథ్యంలో తన అభిమాన హీరో ఇంటికి వచ్చేసరికి ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయట. ఇక ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ కాంబోలో ఒక మూవీ రానుంది. ఆగస్టులో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here