Kushboo : 8 ఏళ్ళ వయస్సులోనే నా తండ్రి నాపై అత్యాచారం చెయ్యబోయ్యాడు అంటూ సంచలన కామెంట్స్ చేసిన హీరోయిన్ కుష్బూ

- Advertisement -

Kushboo : నిన్నటి తరం హీరో హీరోయిన్లలో ఇప్పటికీ మంచి డిమాండ్ ఉన్న నటీనటులుగా ఎంతో మంది కొనసాగుతున్నారు.వారిలో ప్రముఖ హీరోయిన్ కుష్బూ కూడా ఒకరు. తెలుగు , హిందీ , తమిళం , మలయాళం అని తేడా లేకుండా ప్రతీ భాషలోనూ స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి ఇండియన్ సినిమాలో ఒక వెలుగు వెలిగిన నటి కుష్బూ.విక్టరీ వెంకటేష్ మొదటి సినిమా ‘కలియుగ పాండవులు’ చిత్రం ద్వారా వెండితెరకి పరిచయమైనా కుష్బూ తొలి సినిమాతోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది.

Kushboo
Kushboo

ఆ తర్వాత ఈమెకి టాలీవుడ్ , బాలీవుడ్ మరియు కోలీవుడ్ లలో వరుసగా ఆఫర్లు రావడం మొదలెట్టాయి.ముఖ్యంగా తమిళం లో ఈమెకి అప్పట్లో రజినీకాంత్ కంటే ఎక్కువ క్రేజ్ ఉండేది.ఈమెకి ఆరోజుల్లోనే దేవాలయాలను ఏర్పాటు కూడా చేసారు.అంతటి అభిమానం ని సంపాదించుకున్న ఈమె రాజకీయాల్లో కూడా గొప్పగా రాణించింది.బీజేపీ పార్టీ లో కొనసాగుతున్న ఈమెకి రీసెంట్ గానే నేషనల్ కౌన్సిల్ ఫర్ విమెన్ బోర్డు ని లీడ్ చేసే బాధ్యతలు చేపట్టింది.

Actress Kushboo

ఈ సందర్భంగా రీసెంట్ గానే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఆమె సమాజం లో ఆడవాళ్ళపై జరుగుతున్నా అత్యాచారాల గురించి మాట్లాడింది. ఈ సందర్భంగా తన నిజ జీవితం లో చోటు చేసుకున్న కొన్ని నీచమైన సంఘటనలను గుర్తు చేసుకుంటూ ఎంతో భావోద్వేగానికి గురైంది. ఆమె మాట్లాడుతూ ‘నాకు 8 ఏళ్ళ వయస్సు ఉన్నప్పుడే దుర్మార్గుడైన నా తండ్రి నాపై లైంగిక దాడులు జరిపేవాడు. చాలా సార్లు నన్ను బలవంతం కూడా చెయ్యబొయ్యే వాడు. ఇష్టమొచ్చినట్టు తాగేసి వచ్చి ఇంట్లో మా అమ్మని కొట్టేవాడు. చిన్నప్పటి నుండి అతని ఆగడాలను చూసి చూసి విసుగెత్తిపోయిన నేను నాకు 15 ఏళ్ళు వచ్చిన తర్వాత అతనిపై ఎదురుదాడి చెయ్యడం ప్రారంభించాను,నాకు 16 ఏళ్ళ వయస్సు వచ్చేలోపు అతను మమల్ని వదిలి పారిపోయాడు. ఇప్పుడు అతను బ్రతికి ఉన్నాడో, చచ్చాడో కూడా నాకు తెలియదు’ అంటూ కుష్బూ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సషనల్ టాపిక్ గా మారింది.

Kushboo COmments
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here