Ankitha : మళ్ళీ ఎన్టీఆర్‎తో ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇవ్వనున్న సింహాద్రీ బ్యూటీ.. లక్కంటే తనదే

- Advertisement -

Ankitha ఈమధ్య సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోయిన్లు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. తమ అందచందాలతో సినిమా రంగాన్ని ఏలిన అందగత్తెలు పెళ్లి చేసుకుని, పిల్లలు పుట్టి, జీవితంలో సెటిల్ అయి, తమ వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ లిస్ట్‌లో ఇప్పటికే చాలా మంది అందాల భామలు ఉన్నారు. అయితే తాజాగా ఇదే లిస్ట్‌లో సింహాద్రి హీరోయిన్ అంకిత కూడా చేరబోతోందని సమాచారం. ఇటీవలి కాలంలో కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ఫేడ్ అవుట్ అయిన హీరోయిన్ల అడ్రస్‌లను వెతుక్కుంటూ వెళ్లి ఇండస్ట్రీని వీడిన వారిని లైవ్‌కి తీసుకురావడం మనకు తెలిసిందే. దాంతో హీరోయిన్ అంకితను ఓ యూట్యూబ్ ఛానెల్‌లో లైవ్‌కి తీసుకొచ్చింది. ఎక్కడో అమెరికాలో సోషల్ మీడియాకు మాత్రమే దగ్గరైన హీరోయిన్ అంకిత వారి ఇంటికి వెళ్లి ఇంటర్వ్యూ చేసింది. ఈ క్రమంలో అంకిత తన మనసులోని మాటలన్నింటినీ ఒక్కసారిగా బయటపెట్టింది.

Ankitha
Ankitha

అంతేకాదు భారీ అంచనాలతో వచ్చిన “విజయేంద్ర వర్మ” ఫ్లాప్ అవ్వడంతో తాను సినీ పరిశ్రమ నుంచి తప్పుకున్నానని అంకిత పరోక్షంగా చెప్పింది. మళ్లీ సినిమాలో అవకాశం ఇస్తే తప్పకుండా నటిస్తానని హామీ ఇచ్చింది. అంతేకాదు బన్నీ, ఎన్టీఆర్‌లను సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నానని, వారితో టచ్‌లో ఉన్నానని చెప్పింది. ఈ క్రమంలో ఎన్టీఆర్‌తో అంకిత మరోసారి జోడీ కట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ తో సింహాద్రి లాంటి పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్న అంకిత మళ్లీ అలాంటి హిట్ ఇస్తుందా అనేది అనుమానమే..? అయితే కొరటాల శివను చాలా మంది సజెస్ట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ దేవర సినిమాలో అంకితకు చిన్న పాత్ర ఇవ్వాలని వారు సూచిస్తున్నారు. చూద్దాం మరి కొరటాల – ఎన్టీఆర్ అభిమానుల సలహాలు వింటారో లేదో. అదే జరిగితే ఎన్టీఆర్ సినిమాతో అంకిత రీఎంట్రీ ఇవ్వడం ఖాయం.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here