Siddharth : పిచ్చి ప్రశ్నలు అడిగితే మొహం పగులుద్ది అంటూ సురేష్ కొండేటి కి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన హీరో సిద్దార్థ్

- Advertisement -

Siddharth : ఒకప్పుడు యూత్ మరియు లేడీస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించిన హీరోలలో ఒకడు సిద్దార్థ్. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ని ప్రారంభించి ఆ తర్వాత హీరో గా మారి తెలుగు , హిందీ మరియు తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన సిద్దార్థ్, తెలుగులో బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఓయ్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. ఏ ఇండస్ట్రీ లో కూడా రాని క్రేజ్ సిద్దార్థ్ కి మన ఇండస్ట్రీ లో వచ్చింది. కానీ ఒకానొక సమయం లో ఆయనకీ వరుస ఫ్లాప్స్ రావడం వల్ల టాలీవుడ్ ఇండస్ట్రీ ని వదిలి కోలీవుడ్ కి వెళ్ళాడు. అక్కడ హిట్స్ అయితే వచ్చాయి కానీ స్టార్ స్టేటస్ మాత్రం రాలేదు. ఇప్పుడు చాలా కాలం తర్వాత ఆయన మన ముందుకు చిన్న అనే సినిమా ద్వారా వచ్చాడు. ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా సిద్దార్థ్ ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసాడు.

Siddharth
Siddharth

అక్టోబర్ 6 వ తేదీన విడుదల అవ్వబోతున్న ఈ చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమాని తమిళం లో బయ్యర్స్ కి చూపించాను, అక్కడ ఉదయ్ నిధి స్టాలిన్ గారికి ఎంతో నచ్చి,ఇలాంటి సినిమాని నా జీవితం లో చూడలేదు అని చెప్పి ఈ చిత్రాన్ని కొనుగోలు చేసాడు, అక్కడ సూపర్ హిట్ అయ్యింది. అలాగే కేరళ లో గోపాలన్ మూవీస్ వారు కొన్నారు, కన్నడ లో కేజీఎఫ్ నిర్మాతలు హోమబుల్ సంస్థ వారు కూడా ఈ సినిమాని కొనుగోలు చేసారు. అన్ని చోట్ల రెస్పాన్స్ వచ్చింది. కానీ సెప్టెంబర్ 28 వ తారీఖున తెలుగు లో విడుదల చేసుకోలేకపోయాను, కారణం ఇక్కడ సిద్దార్థ్ సినిమాలు ఇంకా ఎవరు చూస్తారు అని ఒక్క బయ్యర్ కూడా ముందుకు రాలేదు. అలాంటి సమయం లో ఏషియన్ సంస్థ వారు ముందుకు వచ్చారు. ఈ చిత్రం కచ్చితంగా ఇక్కడ కూడా సక్సెస్ సాధిస్తుంది. ఇంతకు మించి నేను గొప్పగా సినిమా చెయ్యలేను’ అంటూ చెప్పుకొచ్చాడు.

అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో ప్రముఖ విలేఖరి సురేష్ కొండేటి తో మాట్లాడుతూ ‘మీకు వార్నింగ్ ఇవ్వమని ఇంటర్నెట్ మొత్తం నుండి నాకు ఒత్తిడి వచ్చింది. సురేష్ అనే అతను మైక్ తీసుకొని నోటికి వచ్చినట్టు పిచ్చి మాటలు మాట్లాడుతాడు, అర్థం పర్ధం లేని ప్రశ్నలు అడుగుతాడు. దయచేసి వాటికి మీరు సమాధానం చెప్పొద్దు, అతను అలాంటి పిచ్చి ప్రశ్నలు అడిగితే బాధ్యత మీదే ఆ తర్వాత అని అన్నారు. అప్పుడు నేను సురేష్ మా స్నేహితుడు అయ్యా, అలాంటివి ఏమి అడగడు, ఒకవేళ అడిగినా నాకు పర్లేదు అని చెప్పాను’ అంటూ సిద్దార్థ్ చాలా వ్యంగ్యంగా సురేష్ కొండేటి కి వార్నింగ్ ఇచ్చాడు. సురేష్ కొండేటి ఇప్పటి వరకు ఎలాంటి కాంట్రవర్సీ సృష్టించే ప్రశ్నలు అడిగాడో మన అందరికీ తెలిసిందే.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here