Shivaji: చెప్పులు లేకుండా తిరిగిన హీరో శివాజీ ఇప్పుడు శివన్నగా మారడానికి ఇన్ని కష్టాలు పడ్డాడా!!

- Advertisement -

Shivaji: క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను ప్రారంభించిన శివాజీ, ఇప్పుడు శివన్నగా తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైయ్యాడు. సినిమాల్లో ఉన్నప్పటి కంటే ఇప్పుడు శివాజీ జనాల్లో చాల ఎక్కువ క్రేజ్ ఉంది. ఈ క్రేజ్ కు కారణం మాత్రం బిగ్ బాస్. శివాజీ బిగ్ బాస్ లో ఆడిన గేమ్ తెలుగు స్టేట్స్ లో ఉన్న ఆడియన్స్ చాలామంది ఫిదా అయ్యారు. శివాజీ గెలవకపోయినా కూడా గెలిచిన దానికంటే కూడా ఎక్కువ ఆదరణ, గుర్తింపు లభించింది. అయితే ఇప్పుడు ఇంత గొప్ప స్థాయిలో ఉన్న శివాజీ తన కెరీర్ ప్రారంభంలో మాత్రం చాల ఇబ్బందులు పడ్డాడు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో చెప్పులు లేకుండా అవకాశాల కోసం ఆఫీస్ ల చుట్టూ తిరిగేవాడినని శివాజీ ఒక షోలో వెల్లడించారు.

hero shivaji faced lot of struggles in his life in the process of achieving his goals
hero shivaji faced lot of struggles in his life in the process of achieving his goals

హీరో మొదటగా నాగార్జున మూవీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు. ఆ తరువాత మెల్లగా ఎదుగుతూ… హీరో స్థాయికి చేరుకున్నారు. ఇప్పటికి హీరోగా ఒక దాదాపు 26 మూవీస్ చేశాడు. మొత్తంగా 96 మూవీస్ చేశానని చెప్పుకొచ్చాడు. అయితే హీరోగా శివాజీ చాలా పెద్ద హిట్స్ ను అందుకున్నారు. తన తాజ్ మహల్ మూవీలో ఉన్న “మాయదారి మైసమ్మ” అనే సాంగ్ ఎంత ఫేమస్ అయిందో అందరికి తెలుసు. అయితే కెరీర్ పీక్ లో ఉన్నప్పుడే శివాజీ రాజకీయాల్లోకి వెళ్ళాడు. అయితే అక్కడ మాత్రం చాలా ఎదురుదెబ్బలు తగిలాయి. ఏ పార్టీలో చేరినప్పటికీ రాజకీయంగా చాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

అనేక విషయాల్లో అరెస్ట్ కూడా అయ్యారు. అయితే ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటూ, శివన్నగా మూవీస్ చేస్తూ ఉన్నారు. తన పిల్లల కోసమే తానూ మళ్ళీ మూవీస్ చేస్తున్నానని శివాజీ ఇప్పటికే చాల ఇంటర్వూస్ లలో చెప్పారు. రీసెంట్ గా వచ్చిన 90’s మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్ చాల పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు చాల తెలుగు మూవీస్ లలో కూడా శివాజీ ఆక్ట్ చేస్తున్నారు. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ తో కూడా ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నట్టు శివాజీ అప్పట్లో చెప్పారు, మరి అది ఎప్పుడు బయటకు వస్తుందో వేచి చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here