Hero Ravi Teja తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో మెగాస్టార్ చిరంజీవి తర్వాత స్వయంకృషి తో పైకి వచ్చిన హీరో ఎవరైనా ఉన్నారా అంటే టక్కుమని మాస్ మహారాజ రవితేజ మాత్రమే అని ఎవరైనా చెప్తారు, సినిమాల్లో అవకాశాల కోసం కెరీర్ తొలినాళ్లలో రవితేజ పడిన కష్టాలు అన్ని ఇన్ని కావు, సినిమాల మీద పిచ్చి తో ఒక్కే ఒక్క అవకాశం కోసం స్టూడియోల చుట్టూ తిరిగి ఎట్టకేలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీర్ ని ప్రారంభించాడు రవితేజ.

ఆ తర్వాత చిన్నగా సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ లో నటించాడు రవితేజ, చివరికి అప్పట్లో కొన్ని సినిమాల్లో కమెడియన్ గా కూడా నటించాడు, అలా నటిస్తూ ఉన్న సమయం లో రవితేజ కి తొలిసారి నీకోసం అనే సినిమాలో హీరోగా నటించే అవకాశం దక్కింది, శ్రీను వైట్ల దర్శకత్వం లో వచ్చిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు, ఆ తర్వాత కూడా లీడ్ రోల్స్ లో నటించిన రవితేజ కి హీరో గా తొలి హిట్ వచ్చింది మాత్రం ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా తో, పూరి జగన్నాథ్ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా రవితేజ కి హీరోగా మంచి బ్రేక్ ని ఇచ్చింది.

ఆ తర్వాత రవితేజ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి ఇలా కెరీర్ ప్రారంభం లో తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు అందుకొని అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరో గా ఎదిగాడు రవితేజ, ఈరోజు ఆయన ఏ స్థాయిలో ఇండస్ట్రీ లో వెలుగుతున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, రవితేజ సిని ప్రయాణం ప్రతి ఒక్కరికి ఒక్క ఆదర్శం అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు.

రవితేజ వెండితెర ప్రస్థానం అందరికి తెలిసినా, ఆయన వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువ మందికి తెలుసు, రవితేజ అసలు పేరు రవి శంకర్ రాజు భూపతి రాజు, జనవరి 26 1968 వ సంవత్సరం లో జన్మించిన రవితేజ స్వస్థలం భీమవరం, 2002 వ సంవత్సరం లో తేజస్విని అనే అమ్మాయి ని పెళ్లి చేసుకున్న రవితేజ కి ఒక్క పాప ఒక్క బాబు ఉన్నారు.

కూతురు పేరు మోక్షద మరియు కొడుకు పేరు మహాదన్, కొడుకు ఇప్పటికే రాజ ది గ్రేట్ సినిమాలు ద్వారా వెండితెర కి పరిచయం అయినా సంగతి మన అందరికి తెలిసిందే,తొలి సినిమా లోనే హుషారు అయినా నటన తో అందరిని ఆకట్టుకున్న మహాదన్ త్వరలోనే హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టనున్నాడు, ఇక కూతురు మోక్షద ఫోటోలను చూస్తే చాలా మంది టాప్ హీరోయిన్లు కూడా ఆమె అందం ముందు పనికిరారు అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు, రవితేజ ఫ్యామిలీ ఫోటో ని ఎక్సక్లూసివ్ గా మీరు క్రింద చూడవచ్చు.
