‘రావణాసుర’ మొట్టమొదటి రివ్యూ..రవితేజ హ్యాట్రిక్ కొట్టబోతున్నాడా!

ravanasurra-first-review


Ravanasura First Review : మాస్ మహారాజ రవితేజ హీరో గా నటించిన ‘రావణాసుర’ మూవీ ఏప్రిల్ 7 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాకి సంబంధించిన టీజర్ , ట్రైలర్ మరియు పాటలు విడుదలై ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుంది.ముఖ్యంగా మొన్న విడుదలైన ట్రైలర్ ఆడియన్స్ మైండ్ ని బ్లాక్ అయ్యేలా చేసింది.

ravanasurra first review
ravanasurra first review

ఇందులో రవితేజ ని చూసిన ప్రతీ ఒక్కరికి కిక్ సినిమాలోని రవితేజ పాత్ర గుర్తుకు వచ్చింది.’ధమాకా’ మరియు ‘వాల్తేరు వీరయ్య’ వంటి వరుస సూపర్ హిట్ సినిమాలతో మంచి ఊపు మీదున్న రవితేజ కి ‘రావణాసుర’ తో హ్యాట్రిక్ హిట్ తగలనుంది అని ఫ్యాన్స్ బలమైన నమ్మకం తో ఉన్నారు.ఈరోజే ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి.సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి A సెరిటికెట్ ఇవ్వడం ఇప్పుడు అభిమానులను కంగారుకి గురి చేస్తుంది.

Ravi Teja

విపరీతమైన హింస మరియు వల్గర్ భాష ఉంటే తప్ప సెన్సార్ సభ్యులు A సర్టిఫికెట్ ఇవ్వరు, అలాంటిది ఈ చిత్రానికి A సర్టిఫికెట్ ఇవ్వడాన్ని చూస్తూ ఉంటే మూవీ వయోలెన్స్ బాగా ఉన్నట్టుగా తెలుస్తుంది.ఏ చిత్రానికి అయినా సెన్సార్ సభ్యులు UA సర్టిఫికెట్ ఇచ్చారంటే ఆ సినిమాని ఫ్యామిలీస్ మరియు అడల్ట్స్ చూడొచ్చని, అదే ఒక సినిమాకి U సర్టిఫికెట్ ఇచ్చారంటే కేవలం ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రమే చూసే సినిమాని.

Ravi Teja Movie

ఈ రెండు కాకుండా A ఇచ్చారంటే మాత్రం కేవలం అడల్ట్స్ మాత్రమే చూసామే సినిమా అని, 18 సంవత్సరాల కంటే చిన్నవాళ్లు సదరు చిత్రాన్ని చూడకూడదు అని.అంటే ఇప్పుడు ‘రావణాసుర’ సినిమాని కేవలం అడల్ట్స్ మాత్రమే చూడాలన్నమాట. కానీ రవితేజ సినిమా రిపోర్ట్ మాత్రం అదిరిపోయింది. ఆద్యంతం వినోదం మరియు ఎమోషన్స్ తో ఈ చిత్రాన్ని డైరెక్టర్ సుధీర్ వర్మ అద్భుతంగా తెరకెక్కించాడని చెప్తున్నారు. మరి వాళ్ళు చెప్తున్నా మాటల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే మరో వారం రోజులు ఎదురు చూడాల్సిందే.

Ravi Teja Ravanasura movie