సినిమా రంగంలో బాగా స్థిరపడిన ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు రానా. రామానాయుడు మనవడిగా, సురేష్ బాబు తనయుడిగా సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చారు. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సౌత్ తో పాటు బాలీవుడ్ లోనూ పాపులారిటీ పొందారు. ఆయన లైఫ్ స్టైల్ చూస్తే ఎవ్వరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఖరీదైన కార్లు, విలాసవంతంమైన బంగళాలు, తెలివైన పెట్టుబడులతో అదుర్స్ అనిపిస్తున్నారు. రానా ఖరీదైన ఆస్తులు, విలాసవంతమైన జీవనశైలి గురించి తెలిస్తే షాక్ అవుతారు.

బాహుబలిలో విలన్ పాత్రలో నటించిన రాణా ఒక్కసారిగా దేశవ్యాప్తంగా అందరి దృష్టిలో పడ్డాడు. బాహుబలి బిగినింగ్ బాహుబలి ది కంక్లూజన్ సూపర్ హిట్ లుగా నిలిచిన తర్వాత రానా స్వయంగా హీరోగా చేస్తున్న సినిమాలు ఏవీ వర్కౌట్ కావడం లేదు. సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ఉండడంతో పలు సినిమాలకు సమర్పకుడిగా వ్యవహరిస్తూ వస్తున్నాడు. కేవలం సినిమా నిర్మాణం మాత్రమే కాదు పలు స్టార్టప్ కంపెనీలు కూడా రానా ప్రారంభించాడు. 2023వ సంవత్సరానికి గాను ఆయన ఏడాదికి 8:50 కోట్ల రూపాయలు యావరేజ్ గా సంపాదిస్తున్నాడట. ఎక్కువగా ఆయనకు యాక్టింగ్ మీదనే రెమ్యూనరేషన్ వస్తుండగా తర్వాత బిజినెస్ లో కొన్ని పెట్టుబడుల ద్వారా వాటాలు, బ్రాండ్ ప్రమోషన్లు, అడ్వర్టైజ్మెంట్ ల ద్వారా డబ్బులు వస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఆయన ఒక్కొక్క సినిమాకి నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు చార్జి చేస్తారట. అంటే దాదాపుగా నెలకు మినిమం 50 లక్షల వరకు డబ్బు సంపాదిస్తున్నాడు. అలాగే ఒక్కొక్క బ్రాండ్ కి ప్రమోట్ చేయాలంటే 70 నుంచి 80 లక్షలు చార్జ్ చేస్తున్నాడు. ఆయన సియట్ టైర్లు, రామరాజు కాటన్, కోకోకోలా స్మార్ట్ వాటర్, ప్రో కబడ్డీ లీగ్ లో తెలుగు టైటాన్స్ వంటి వాటిని ప్రమోట్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు. సినిమాల్లో బిజీగా ఉన్నా, రానా తన కుటుంబం కోసం సమయాన్ని కేటాయిస్తారు. తన భార్య మిహీకా బజాజ్‌తో కలిసి ఫారిన్ టూర్లు వేస్తుంటారు.