Nani ‘చిన్నప్పటి నుండి తమిళ సినిమాలే చూస్తూ పెరిగాను’ అంటూ హీరో నాని షాకింగ్ కామెంట్స్

- Advertisement -

Nani : పాన్ ఇండియన్ లెవెల్ లో మంచి హైప్ ని తెచ్చుకున్న చిత్రాలలో ఒకటి న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ‘దసరా’ చిత్రం. శ్రీకాంత్ ఓడేలా అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమాని నాని తన కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఈ సినిమా తెలుగు సినీ పరిశ్రమకి మరో కాంతారా లాంటి చిత్రమని, కచ్చితంగా ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనే నమ్మకం నాకు ఉంది అంటూ నాని మాట్లాడిన మాటల్లో ఆయన కాంఫిడెన్స్ చూస్తూ ఉంటె, నిజంగానే ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ అవ్వబోతుందా అనే ఫీలింగ్ అందరిలో కలిగించింది ఈ చిత్రం.

Hero Nani
Hero Nani

ఆయన మాటలకు తగ్గట్టుగానే ఈ సినిమాకి సంబంధించిన టీజర్స్ మరియు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 14 వ తారీఖున ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ విడుదల కాబోతుంది. ఈ సినిమాని అన్ని బాషలలో గ్రాండ్ గా విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్న నేపథ్యం లో రీసెంట్ గానే చెన్నై లో మరియు లక్నో లో ఈవెంట్స్ ని ఏర్పాటు చేసారు.

Dasara movie

చెన్నై లో జరిగిన ఈవెంట్ లో హీరో నాని మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఆయన మాట్లాడుతూ ‘చిన్నతనం నుండి నేను తమిళ సినిమాలు చూస్తూనే పెరిగాను. ఇక్కడి దర్శకులు మరియు హీరోలు నాకు ఎంతో ఆదర్శం. ముఖ్యంగా మణిరత్నం మరియు కమల్ హాసన్ గారి సినిమాలకు వీరాభిమానిని’ అంటూ చెప్పుకొచ్చాడు నాని. ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

- Advertisement -
Nani in Dasara movie

ఈ చిత్రం లో ఆమె పోషించిన పాత్రకి నేషనల్ అవార్డు మరోసారి కచ్చితంగా వస్తుందనే నమ్మకంతో ఉన్నారు మూవీ టీం మొత్తం. నాని ఈ సినిమా తర్వాత అధికారికంగా ఇక స్టార్ హీరోస్ లీగ్ లోకి అడుగుపెట్టబోతున్నాడని, చిరంజీవి కి ఖైదీ, మహేష్ కి పోకిరి మరియు పవన్ కళ్యాణ్ కి ఖుషి సినిమాలు ఎలా అయితే మైలు రాళ్లుగా నిలిచాయో నాని కి దసరా అలాంటి మైలు రాయిగా నిలుస్తుందని బలమైన నమ్మకం తో ఉంది మూవీ టీం, మరి వాళ్ళ నమ్మకాలను ఈ సినిమా నిలబెడుతుందో లేదో తెలియాలంటే ఈ నెల 30 వ తారీఖు వరకు వేచి చూడాల్సిందే.

Natural star Nani
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here