Manchu Manoj – Mounika Reddy గురించి అందరికీ తెలిసిందే. దాదాపు 15 ఏళ్లుగా పరిచయం ఉన్న వీరిద్దరూ గతేడాది పెళ్లి చేసుకున్నారు. అయితే ఎన్నో సవాళ్లను ఎదుర్కొని తమ ప్రేమను గెలుచుకున్న ఈ జంట ఇప్పుడు తమ వైవాహిక జీవితాన్ని హ్యాపీగా గడుపుతోంది. ఈ పెళ్లికి ముందే మౌనికారెడ్డికి ఓ కొడుకు కూడా ఉన్నాడు.
ఇదిలా ఉంటే గత ఏడాది డిసెంబర్లో మనోజ్ తన అభిమానులకు శుభవార్త అందించిన సంగతి తెలిసిందే. తన భార్య భూమా మౌనిక రెడ్డి తల్లి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. ఈ విషయంలో తన కుటుంబమంతా సంతోషంగా ఉందని మనోజ్ తెలిపాడు. అయితే ఈ సమయంలో.. భూమా మౌనిక తాజాగా ఓ ఆసక్తికర ఫోటోను షేర్ చేసింది. ఇప్పుడు ఆ ఫోటో వైరల్ అవుతోంది.
గత ఏడాది డిసెంబర్లో మంచు భార్య భూమా మౌనిక గర్భవతి అని మనోజ్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారని ఈ జంట సంతోషం వ్యక్తం చేశారు. ఈ శుభవార్త తెలియడంతో అటు మనోజ్ కుటుంబ సభ్యులతో పాటు ఆయన అభిమానులు కూడా చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. అయితే తాజాగా భూమా మౌనిక సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన ఫోటో పోస్ట్ చేసింది. మౌనిక బ్లాక్ డ్రెస్‌లో బేబీ బంప్‌తో కనిపిస్తుంది.
అలాగే మనోజ్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. ‘నా పక్కన ఉండే వారితో నా జీవితం నన్ను ఎప్పుడూ ఆకర్షిస్తుంది. నన్ను మళ్లీ మళ్లీ ప్రేమలో పడేలా చేస్తుంది’ అంటూ తన భర్త మనోజ్‌తో పాటు మొదటి కుమారుడు ధైరవ్‌ను ట్యాగ్ చేసింది. ‘పిల్లా..ఓ పిల్లా.. నువ్వే నా ప్రాణం’ అంటూ మౌనిక పెట్టిన పోస్ట్ పై మనోజ్ సరదాగా పోస్ట్ చేసాడు. దీంతో మౌనికకు సంబంధించిన బేబీ బంప్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన మనోజ్ అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఎప్పుడూ ఇలాగే హ్యాపీగా ఉండాలి అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ప్రేమనే కాదన్నా తండ్రి కాబోయే నేకు కంగ్రాట్స్ అంటూ.. కామెంట్లు చేస్తున్నారు.