Balakrishna : నేటితరం హీరోలలో బాలకృష్ణ కి బాగా ఇష్టమైన స్టార్ హీరో అతనేనా..?

- Advertisement -

Balakrishna : నిన్నటి తరం హీరోలలో ఊర మాస్ అనే పదానికి సరికొత్త నిర్వచనం లాగ నిల్చిన హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది నందమూరి బాలకృష్ణ మాత్రమే. నందమూరి తారకరామారావు కొడుకుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ని ఏర్పాటు చేసుకున్న లెజెండ్ ఆయన. ఎన్టీఆర్ ఎక్కువగా పౌరాణికం, జానపదం సినిమాలు చేస్తూ సూపర్ స్టార్ అయ్యాడు.

Balakrishna
Balakrishna

కానీ బాలకృష్ణ ని సూపర్ స్టార్ ని చేసింది మాత్రం మాస్ సినిమాలే. కెరీర్ లో ఎన్ని సూపర్ హిట్స్ ఉన్నాయో, అన్ని అట్టర్ ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. అదంతా పక్కన పెడితే బాలయ్య కి బాగా ఇష్టమైన హీరో ఎవరు అని అడిగితే కచ్చితంగా అందరూ సీనియర్ ఎన్టీఆర్ పేరు చెప్తారు. బాలయ్య బాబు కూడా ఎన్నో వందల సార్లు ఈ విషయం చెప్పాడు, మా నాన్న గారే నా అభిమాన నటుడి అని.

Balakrishna Updates

అయితే ఆయన నేటి తరం స్టార్ హీరోల సినిమాలను కూడా బాగానే చూస్తాడట. ఆయనకీ బాగా ఇష్టమైన హీరో కూడా టాలీవుడ్ లో ఒకరు ఉన్నారట. అతను మరెవరో కాదు, సూపర్ స్టార్ మహేష్ బాబు. మొదటి నుండి మహేష్ బాబు అంటే బాలయ్య కి ఎంతో ప్రత్యేకమైన అభిమానం అట. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే బాలయ్య బాబు తన కూతురు ని మహేష్ బాబు కి ఇచ్చి పెళ్లి చేసేవాడు.

- Advertisement -
Balakrishna Movies

కానీ మహేష్ బాబు నమ్రత తో ప్రేమలో ఉన్నాడు అనే విషయం తెలుసుకొని సైలెంట్ అయిపోయాడట. ఇకపోతే బాలయ్య బాబు హోస్ట్ గా వ్యవహరించిన ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ షో లో కూడా మహేష్ బాబు ఒక ఎపిసోడ్ కి ముఖ్య అతిథిగా వస్తాడు. ఇలా వీళ్లిద్దరి మధ్య ఇంత బాండింగ్ ఉండడం తో వీళ్ళ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తే చూడాలని ఫ్యాన్స్ పరితపిస్తున్నారు, మరి ఆ అదృష్టం ఎప్పుడు కలుగుతుందో చూడాలి.

Balakrishna Mahesh babu
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here