తమిళ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రఘువరన్ బీటెక్ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెదరని ముద్ర వేశాడు. ఆయన నటించిన చిత్రాలు తమిళంతో పాటు తెలుగులో విడుదల అవుతుంటాయి. ఈ ఏడాది తెలుగులో సార్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్యను పెళ్లి చేసుకున్న ధనుష్ ఇటీవల ఆమెకు విడాకుల దాకా వచ్చారు.
ధనుష్‌కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ధనుష్ తాను ఇంటర్‌లో ఓ అమ్మాయిని ప్రేమించినట్లు చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాను పదో తరగతిలో ఉన్నప్పుడు బాగా చదివేవాడినని, క్లాస్‌లో ఎల్లప్పుడూ టాపర్‌గా ఉండేవాడినని చెప్పాడు. అయితే.ఇంటర్‌కు వచ్చే సరికి పరిస్థితి తారుమారైందన్నాడు. ఆ సమయంలో తాను ఓ అమ్మాయితో ప్రేమలో పడినట్లు తెలిపాడు.
దీంతో అప్పటి నుంచి చదువు అటకెక్కిందన్నాడు. ఆ అమ్మాయితో చాటింగ్ చేయడమే పనిగా పెట్టుకున్నానని, చదువును గాలికి వదిలివేసినట్లు చెప్పాడు. ఏదో అత్తెసరు మార్కులతో ఇంటర్ పాసైనట్లు వెల్లడించారు. ఆ అమ్మాయి వల్లే తన ఇంటర్ జీవితం నాశమైందని, లేకపోతే ఇంటర్‌లో మంచి మార్కులు తెచ్చుకునేవాడిననంటూ సార్ సినిమా ప్రమోషన్స్‌లో ధనుష్ సరదాగా ఈ వ్యాఖ్యలు చేశాడు.