Hema Malini ప్రముఖ అందాల నటి హేమమాలిని గురించి ప్రేక్షకులకు చెప్పనవసరం లేదు. ఆమె నటి మాత్రమే కాదు లోక్ సభ ఎంపీ కూడా. ఎంతోమంది అభిమానుల మనసుల్లో కలల రాణిగా వెలుగొందిన ఆమె తన కెరీర్ కు సంబంధించి ఓ విషయం గురించి మాట్లాడారు. హేమమాలిని గతంలో ఒక సినీ దర్శకుడి కారణంగా చాలా ఇబ్బంది పడిందట. ఓ సినిమా షూటింగ్ సమయంలో సెట్లో అందరూ ఉండగానే వారందరి ముందు కట్టుకున్న చీర తీసేయమంటూ డైరెక్టర్ చెప్పడంతో ఆమె షాక్ కు గురయ్యానని చెప్పారు. హేమ మాలిని ప్రస్తుం సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. అదే సమయంలో ఆమె ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా మారారు. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన కెరీర్ గురించిన అంశాలు, భర్త ధర్మేంద్రతో పెళ్లి, పిల్లల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలోనే తాను హీరోయిన్ గా ఉన్నప్పుడు జరిగిన ఘటన గురించి వెల్లడించారు.
ఆమె మాట్లాడుతూ.. ఒక సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంఘటన నేనెప్పటికీ మర్చిపోలేను. ఆ సినిమా డైరెక్టర్ నాపై ఒక రకమైన సన్నివేశాన్ని చిత్రీకరించ తలుచుకున్నాడు. నిజానికి నాకు.. చీర పైటకు పిన్ పెట్టుకునే అలవాటుంది. కానీ దర్శకుడు ఆ సీన్ చిత్రీకరించే సమయంలో పైట పిన్ను తీసేయమన్నాడు. పిన్ను తీసేస్తే పైట జారిపోతుందని నేను చెప్పాను. వెంటనే ఆ దర్శకుడు నాకు కావాల్సింది కూడా అదే అంటూ రిప్లై ఇచ్చాడు. అతను ఆ మాట అనగానే చాలా భయం వేసింది. ” అంటూ ఆమె చెప్పారు. ఇక ‘సత్యం శివం సుందరం’ అనే సినిమాకు మొదట హీరోయిన్ గా హేమమాలినినే అనుకున్నారట. కానీ ఆమె ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేయడంతో వేరే వారికి ఆ చాన్స్ వెల్లిందట. తర్వాత తన భర్త ధర్మేంద్ర గురించి మాట్లాడుతూ.. ఆయన మా కూతుర్లు ఇద్దరిని చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. కూతుర్ల పెళ్లి విషయంలో ఆయన చాలా కంగారు పడ్డారని తెలిపారు. హేమమాలిని, ధర్మేంద్ర కలిసి షోలే, సీత ఔర్ గీత అనే సినిమాలో నటించారు.