Hebah Patel : అందం , టాలెంట్ ఉన్నప్పటికీ కూడా కెరీర్ లో అనుకున్న స్థాయికి చేరుకోని యంగ్ హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో హెబ్బా పటేల్ కచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది. ఈమె మొట్టమొదటి చిత్రం ‘కుమారి 21F’. రాజ్ తరుణ్ హీరో గా నటించిన ఈ సినిమా అప్పట్లో కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో హెబ్బా పటేల్ ని చూసిన ప్రతీ ఒక్కరు అమ్మాయి చాలా బాగుంది.
యాక్టింగ్ కూడా కుమ్మేస్తుంది, భవిష్యత్తులో పెద్ద రేంజ్ కి వెళ్తుంది అని అనుకున్నారు. కానీ ఆ సినిమా తర్వాత ఆమె రేంజ్ ఏమాత్రం కూడా మారలేదు. కేవలం చిన్న హీరోల సినిమాలకు మాత్రమే పరిమితం అయ్యింది. అప్పుడప్పుడు ఈమధ్య వెబ్ సిరీస్లలో కూడా కనిపిస్తుంది. ఇప్పుడైతే ఈ హీరోయిన్ కి పాపం అటు సినిమాల్లోనూ, ఇటు వెబ్ సిరీస్లలోను అవకాశాలు రావడం లేదు.
ప్రస్తుతానికి ఖాళీగా ఉంటున్న హెబ్బా పటేల్ గురించి చాలా కాలం నుండి సోషల్ మీడియా లో ఒక రూమర్ తెగ ప్రచారం అవుతుంది. అదేమిటంటే ఈమె ప్రముఖ యంగ్ హీరో రాజ్ తరుణ్ తో చాలా కాలం నుండి ప్రేమలో ఉందని, వీళ్లిద్దరు డేటింగ్ లో ఉన్నారని, అనేక సార్లు హైదరాబాద్ లో వీళ్ళు కాఫీ షాప్స్ లో కలవడం అక్కడి జనాలు చూసారని, ఇలా ఎన్నో రకాల వార్తలు ప్రచారం అయ్యాయి.
దీనిపై రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో హెబ్బా పటేల్ స్పందిస్తూ ‘సోషల్ మీడియా లో ఇలా ప్రచారం అవుతుంది అనే విషయం కూడా నాకు తెలియదు. రాజ్ తరుణ్ తో నేను డేటింగ్ లో ఉన్నాను అంటున్నారు కదా, అలాగే అనుకోండి, నాకేమి పర్వాలేదు. మీ రాతల ప్రభావం నామీద అసలు పడదు’ అంటూ చెప్పుకొచ్చింది హెబ్బా పటేల్.