Vishwak Sen : హాట్ యాంకర్ పై మనసు పారేసుకున్న హీరో విశ్వక్ సేన్.. ఎవరో మీరే చూడండి!

- Advertisement -

Vishwak Sen : ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయం లోనే యూత్ ఆడియన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని దక్కించుకున్న హీరోలలో ఒకడు విశ్వక్ సేన్. చిన్న వయస్సులోనే హీరో గా, డైరెక్టర్ గా, నిర్మాతగా సక్సెస్ అయిన అరుదైన హీరోలలో ఒకడు ఆయన. ‘ఈ నగరానికి ఏమైంది’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి హీరో గా పరిచయమైన విశ్వక్ సేన్, ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడం తోనే ఈయనకి ఆడియన్స్ లో మంచి గుర్తింపు లభించింది.

Vishwak Sen
Vishwak Sen

ఆ తర్వాత ‘ఫలక్ నూమా దాస్’ సినిమాతో హీరో గా మాత్రమే కాకుండా, దర్శకుడిగా కూడా తాను టాలెంటెడ్ అని నిరూపించుకున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత ‘హిట్’, ‘అశోకవనం లో అర్జున కళ్యాణం’, ‘ఓరి దేవుడా’, ‘ధమ్కీ’ వంటి సూపర్ హిట్ సినిమాలు చేసాడు. ఇప్పుడు ఈయన హీరో గా నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’, ‘గామీ’ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

అందులో ముందుగా ‘గామీ’ చిత్రం విడుదల అవ్వబోతుంది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ అఘోరా గా కనిపించాడు. మార్చి 8 వ తారీఖున థియేటర్స్ లో విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని రీసెంట్ గానే విడుదల చేసారు. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ లో ప్రముఖ యాంకర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ స్రవంతి తో విశ్వక్ సేన్ చేసిన చిట్ చాట్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

- Advertisement -

విశ్వక్ సేన్ స్రవంతి తో మాట్లాడుతూ ‘ఈమధ్య కాలం లో మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు. హీరోయిన్స్ కంటే అందమైన చీరలు కూడా కడుతున్నారు’ అంటాడు. దానికి స్రవంతి సిగ్గు పడిపోతుంది. సోషల్ మీడియా లో ఈ వీడియో ని చూసిన నెటిజెన్స్, ఎలాగో నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, స్రవంతి కి పెళ్లయిపోయింది , ఆమెని వదిలేయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here