Ram Charan గురించి యావత్ ప్రపంచానికి ఇప్పుడు తెలుసు..ట్రిపుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.గ్లోబల్ ఫెస్ గా పేరు సంపాదించుకున్న రామ్ చరణ్ వరుసగా చాలా ఇంటర్వ్యూలో అలాగే అవార్డ్స్ ఫంక్షన్ లో పాల్గొంటూ ఎన్నో అవార్డులను దక్కించుకుంటున్నారు. ఇక దీనికి ప్రధాన కారణం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించడమే. ఆర్ఆర్ఆర్ సినిమాకి ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అరుదైన గుర్తింపు లను అవార్డులను అందుకుంది. ఈ సినిమా నుండి ఇప్పటికే నాటు నాటు సాంగ్ కి ఓ అవార్డు వచ్చింది.. అయితే తాజాగా రామ్ చరణ్ తన కోరికను బయట పెట్టాడు.. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

కాగా,రామ్ చరణ్ ఇటీవల పాల్గొన్న గుడ్ మార్నింగ్ అమెరికా అనే ఒక షో వాళ్లు నిర్వహించిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇక నాటు నాటు సాంగ్ ని ఉక్రెయిన్ లో షూట్ చేశారట. అయితే అప్పటికి ఉక్రేయిన్ లో ఎలాంటి గొడవలు లేవని, ఉక్రేయిన్ లో జీవించే ప్రజలందరూ చాలా మంచి వాళ్ళని,అది ఓ అందమైన దేశం అంటూ చాలా పొగిడారు రామ్ చరణ్.. అంతేకాకుండా నాటు నాటు సాంగ్ గురించి మాట్లాడుతూ ఒకవేళ పాటకి ఆస్కార్ అవార్డు వస్తే ఇండియన్ సినిమా హిస్టరీ లోనే ఆస్కార్ అవార్డు దక్కించుకున్న సినిమాగా ఆర్ఆర్ఆర్ కి మంచి గుర్తింపు వస్తుందని చెర్రి అన్నారు.

ఈ సినిమా ఒక్కటే కాదు ఇంకా మరెన్నో సినిమాలకు ఆస్కార్ అవార్డు వచ్చే దిషిగా మేము అడుగులు వేస్తాము. అలాంటి సినిమాలు చేసేందుకు కృషి చేస్తాము. అది కేవలం మా విజయం కాదు. ఇండియన్ ఇండస్ట్రీ విజయంగా భావిస్తాము. అని చెప్పుకొచ్చారు. అంతేకాదు మీరు హాలీవుడ్ సినిమాలు నటించాలనుకుంటున్నారా అని ఆ యాంకర్ రామ్ చరణ్ ని అడిగితే.. అవును నాకు హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ తో సినిమా చేయాలనే కోరిక, అలాగే అవుట్ సైడ్ ఇండియా చిత్రాలు చేయాలనే ప్లాన్లు ఉన్నాయి. కానీ నా కోరిక నెరవేరుతుందో లేదో చూడాలని అన్నాడు.. ఇది ఇలా ఉండగా హాలివుడ్ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తుంది.. చెర్రి కోరిక విన్న మెగాస్టార్ చిరంజీవి ఒక విధంగా ఆనందపడిన, కూడా అతని కోరిక విని షాక్ అయ్యాడని తెలుస్తుంది.. అలాగే ఉపాసన కూడా మామ మాట మీద ఉందని తెలుస్తుంది..