Santhanam : కేవలం హీరోలకు మరియు హీరోయిన్లకు మాత్రమే కాదు. కమెడియన్స్ కి కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు. అందుకు బెస్ట్ ఉదాహరణ మన బ్రహ్మానందం గారే. అలా తమిళం లో ఒకప్పుడు వడివేలు ఇప్పుడు, నేటి తరానికి ఆ రేంజ్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న కమెడియన్ సంతానం. చూసేందుకు హీరో లాగ కనిపించే ఈ కమెడియన్ కామెడీ టైమింగ్ చూస్తే ఎలాంటి వారైనా పొట్టచెక్కలు అయ్యేలాగా నవ్వాల్సిందే.
డైరెక్ట్ తెలుగు సినిమాలో ఇప్పటి వరకు ఈయన నటించలేదు కానీ, తమిళ డబ్బింగ్ సినిమాల ద్వారా మాత్రం మన ఆడియన్స్ కి బాగా సుపరిచితమే. ఇతని పంచ్ డైలాగ్స్ కి ఉండే క్రేజ్ మామూలుది కాదు. సాధారణంగా మన టాలీవుడ్ లో ఉండే రేంజ్ కమెడియన్స్ ఎక్కడా ఉండరని అందరూ అంటూ ఉంటారు. సంతానం ని చూస్తే మన కమెడియన్స్ కామెడీ టైమింగ్ ని మ్యాచ్ చెయ్యగలడు అని అనిపిస్తాది.
ఒకప్పుడు ప్రతీ శుక్రవారం విడుదలయ్యే సినిమాల్లో సంతానం కచ్చితంగా కమెడియన్ గా ఉండాల్సిందే. కానీ ఇప్పుడు మాత్రం ఆయన రూట్ ని మార్చి హీరోగా సినిమాలు చేస్తున్నాడు. 2016 వ సంవత్సరం వరకు వరుసగా సినిమాల్లో కమెడియన్ గా నటిస్తూ వచ్చిన సంతానం, ఆ తర్వాత హీరో గా మాత్రమే నటిస్తూ వస్తున్నాడు. రీసెంట్ గానే ‘డీడీ రిటర్న్స్’ అనే చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు. ఇది ఇలా ఉండగా సంతానం గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయం ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో బయటపడింది.
చూసేందుకు హీరో లాగ కనిపించే సంతానం తల్చుకుంటే టాప్ మోస్ట్ హీరోయిన్స్ ని కూడా తన వలలో పడేయగలడు. కానీ అతను మాత్రం ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు ఉష, ఈమె చూసేందుకు చాలా యావరేజి లుక్స్ తో సంతానం ని ఏమాత్రం మ్యాచ్ చెయ్యలేదని అంటున్నారు నెటిజెన్స్. కానీ చూడాల్సింది అందం కాదు, మనసు అనే కాన్సెప్ట్ తో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లిద్దరి ముగ్గురు పిల్లలు ఉన్నారు.