ఎన్టీఆర్ తో రెండేళ్లు మాట్లాడని హరికృష్ణ.. ఎందుకంటే

- Advertisement -

తెలుగు వారి కీర్తి ప్రపంచానికి చాటి చెప్పిన మహానటుడు నందమూరి తారక రామారావు. దేవుడంటే ఎలా ఉంటాడో ప్రజలకు తెలిపిన నటసార్వభౌముడు. ఆయన పేరు చెప్తే రెండు తెలుగు రాష్ట్రాలు గర్వంతో ఛాతి ముందుకు వస్తుంది. సినిమాల్లో ఆయన చేయని పాత్ర లేదు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ స్థాయికి రావడంలో ఆయన పాత్ర చాలా ఉంది. ఆయన కేవలం సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా తనకంటూ ప్రత్యేక చరిత్ర సృష్టించాడు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పని చేసి.. పేద ప్రజల కోసం ఎన్నో ప్రత్యేక పథకాలను తీసుకువచ్చిన గొప్ప మహనీయుడు. ఆయన తర్వాత నందమూరి నట వారసులుగా ఆయన కొడుకులు హరికృష్ణ, బాలకృష్ణ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే అగ్రహీరోగా బాలకృష్ణ ఎదగగా.. హరికృష్ణ మాత్రం మీడియం లెవెల్‌ హీరోగా నిలిచాడు. కొడుకులందరిలో కెల్లా నందమూరి హరికృష్ణ అంటే ఎన్టీఆర్ కు ఎంతో ఇష్టం. అందుకే తన రాజకీయాలకు సంబంధించిన అన్ని పనులను హరికృష్ణకే చెప్పేవాడు.. ఆయనే దగ్గరుండి చూసుకునేవాడట.

హరికృష్ణ
హరికృష్ణ

అయితే సాధారణంగా హరికృష్ణ కి కోపం చాలా ఎక్కువని తెలుస్తోంది. ఒకానొక సమయంలో తండ్రి ఎన్టీఆర్ ను హరికృష్ణ ఒక కోరిక కోరాడట. తనకు థియేటర్ కట్టాలని ఉంది కడుదామనుకుంటున్నాను అని.. అభిప్రాయం అడిగారట. ఎన్టీఆర్ తన ప్రాణ స్నేహితుడైన ఎఎన్ఆర్ ను కలిసి సలహా తీసుకున్నాడట. హరికృష్ణ థియేటర్ కట్టాలి అంటున్నాడు ఏమంటావ్ అని.. దానికి నాగేశ్వరరావు థియేటర్ కంటే స్టూడియో కడితే బెటర్ అని సలహా ఇచ్చాడట. హరికృష్ణకు చెప్పకుండానే ఎన్టీఆర్ స్టూడియో పనులు స్టార్ట్ చేశాడట. హరికృష్ణ థియేటర్ కట్టాలని అంటే పట్టించుకోని తండ్రి స్టూడియో కట్టడానికి సన్నాహాలు మొదలు పెట్టడంతో హరికృష్ణ తన తండ్రితో రెండేళ్లు మాట్లాడడం మానేశాడట. తర్వాత థియేటర్ స్థానంలోనే స్టూడియో కట్టారని తెలుసుకున్న హరికృష్ణ.. తిరిగి మాట్లాడడం మొదలు పెట్టారట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here