ప్రభాస రాముడిగా, కృతి సనన్ సీతగా నటించిన ఆదిపురుష్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా ఈ శుక్రవారం విడుదలైంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఓం రౌత్ దర్శకత్వంలో తెరరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రామాయణ ఇతిహాసం ఆధారంగా రూపొందని ఆదిపురుష్ సినిమాలో రావణాసురుడిగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ నటించారు. దసరా సందర్భంగా అయోధ్యలో టీజర్‌ను విడుదల చేశారు. దానిపై విపరీతమైన ట్రోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా విడుదలను కొంత కాలం వాయిదా వేసిన చిత్ర యూనిట్.. వీఎఫ్ ఎక్స్, సీజీలపై మరింత శ్రద్ద పెట్టి చాలా వరకు మార్పులు చేసింది.

ఇప్పుడుథియేటర్స్ దగ్గర జాతర వాతావరణం కనిపిస్తుంది. బాణాసంచా కాాలుస్తూ.. డబ్బులతో ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ రావడంతో అభిమానుల ఆనందానికి ఆవదులు లేకుండా పోయాయి. ఇక రాముడి పాత్రలో ప్రభాస్ అద్భుతంగా నటించారంటూ సంబరాలు చేసుకుంటున్నారు అభిమానులు.మరో వైపు ప్రతి థియేటర్ తో హనుమంతుడి కోసం ఒక సీట్ ను ఖాళీగా ఉంచాలని దర్శకుడు ఓం రౌత్ కోరిన విషయం తెలిసిందే. రాముడి కథ ఎక్కడ చెప్పిన అక్కడికి హనుమంతుడు వస్తాడని ప్రతీతి. హనుమంతుడు స్వయంగా విచ్చేసి రామాయణ గాధను వీక్షిస్తారని ప్రజల నమ్మకం.

అనుకున్నట్టే థియేటర్ ను హనుమంతుడు వచ్చాడు. ఆదిపురుష్ సినిమా ప్రదర్శన్ జరుగుతున్న థియేటర్ కు కోతి వచ్చిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హనుమంతుడు రాముడి సినిమాకు వచ్చారంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. ఇది నిజంగా అద్భుతమని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు థియేటర్ కు కోతి సందర్భాలు తక్కువే. ఒకవేళ వచ్చిన ఆ ఈలలు, గోలలకు, అరుపులకు అక్కడి నుంచి పారిపోతాయి. కానీ ఇప్పుడు అలా జరగలేదు. దీంతో ఒక్కసారిగా ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఇది చూసినవారంతా అద్భుతమంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Hanuman watched #Adipurush FDFS. pic.twitter.com/YOtmn0q65M
— LetsCinema (@letscinema) June 16, 2023