Hansika : హన్సి పాప రొమాంటిక్.. అందుకే శంభు తో డేట్ చేశా.. వైరల్ కామెంట్స్

- Advertisement -

Hansika: పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన దేశముదురు సినిమాతో ఆపిల్ బ్యూటీ హన్సిక తెలుగు తెరకు పరిచయం అయింది. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను తన అందం, అభినయం, నటనతో కట్టిపడేసింది. హన్సిక ఇప్పటివరకు ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. హన్సిక ఇటీవల బిజినెస్ మాన్ సోహైల్ కదూరియాను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే . తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన లవ్ బ్రేక్ అప్, న్యూ మ్యారీడ్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

Hansika
Hansika

నేను స్వచ్ఛమైన ప్రేమ కోసం ఎన్నో సంవత్సరాలు ఎదురు చూశాను. బ్రేకప్ తర్వాత మరొకరికి ఓకే చెప్పి వాళ్ళ ప్రేమను అంగీకరించేందుకు నాకు ఏడు సంవత్సరాలు పట్టింది. నాకు ప్రేమపై పూర్తి నమ్మకం ఉంది. నేను రొమాంటిక్ పర్సన్ ని.. కానీ నాకు ప్రేమ వ్యక్తపరచరడం తెలియదు. నేను వివాహ వ్యవస్థను నమ్ముతాను. నిజం చెప్పాలంటే నాతో జీవితం పంచుకునే వ్యక్తి గురించి నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం తీసుకున్నాను.. గతంలో శంభుని లవ్ చేశాను. అది గతం. అది ముగిసిపోయిన కధ..

ప్రస్తుతం దేవుడు నాకు మంచి దారిని చూపించాడు. ప్రతి ఒక్కరి జీవితానికి ఒక కొత్త ప్రారంభం ఉంటుందని నేను నమ్ముతాను అని హన్సిక తెలిపింది. సోహైల్ నా జీవితంలోకి వచ్చాక ప్రేమ మీద నాకు మరింత నమ్మకం ఏర్పడింది అని హన్సిక చెప్పడం విశేషం. ప్రస్తుతం కొత్త ప్రయాణం మొదలు పెట్టా అని హన్సిక తెలిపింది.

- Advertisement -

హన్సిక పెళ్లి చేసుకున్న సోహెల్ గతంలో తన స్నేహితుడి భర్త. దాంతో వీరి పెళ్లి అనౌన్స్ చేసినప్పటి నుంచి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు షికార్లు చేశాయి. వీటన్నింటికి చెక్ పెట్టడానికి హన్సిక వివాహ వేడుక లవ్ షాది డ్రామా పేరుతో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో తన కెరీర్ లో ఎదురైన అనేక అనుభవాలను తన ప్రేమ, పెళ్లి గురించి పలు ఆసక్తికర విషయాలను హన్సిక పంచుకుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here