Guess The Actress : క్యూట్ గా తలపాగా చుట్టుకొని అబ్బాయిలాగా కనిపిస్తున్న ఈ ఫోటో లో ఉన్న చిన్నారి ఎవరో గుర్తు పట్టారా..? ఈమె ఒక ప్రముఖ దిగ్గజ దర్శకుడి కూతురు అయ్యినప్పటికీ కూడా నటనలో విలక్షణత చూపించి ఇండియా లోనే మోస్ట్ టాలెంట్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరిగా నిల్చింది.రీసెంట్ గానే ఈమె టాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది.ఆమె నటించిన తెలుగు సినిమా ఏకంగా ఆస్కార్ అవార్డుని గెల్చుకుంది.ఇంత క్లూ ఇచ్చిన తర్వాత కూడా కనిపెట్టకుండా ఎలా ఉండగలరు..
ఆమె మరెవరో కాదు #RRR చిత్రం లో రామ్ చరణ్ కి జోడిగా నటించిన అలియా భట్.ఈమె టాలీవుడ్ లోకి అడుగుపెట్టకముందే బాలీవుడ్ లో బడా క్రేజీ స్టార్ హీరోయిన్.అందం తో పాటుగా అద్భుతమైన నటన ఈమె సొంతం.ఎంత పెద్ద నటుడైనా ఈమె పక్కన నటిస్తున్నప్పుడు కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తారు.ఎందుకంటే ఏ మాత్రం తడబడినా ఈమె తన నటన తో డామినేట్ చేసేస్తుంది.
అలాంటి క్రేజీ స్టార్ హీరోయిన్ కి సంబంధించిన చిన్ననాటి ఫోటోలు రీసెంట్ గానే సోషల్ మీడియా లో అప్లోడ్ చెయ్యగా అది ఇప్పుడు వైరల్ గా మారిపోయింది.ఆ ఫోటోలను మీరు కూడా క్రింద చూడవచ్చు.ఇంత క్యూట్ గా కనిపిస్తున్న అలియా భట్ ని చూసి ఆమె అభిమానులు ఎంతో మురిసిపోతున్నారు.ఇక రీసెంట్ గానే ఈమె బాలీవుడ్ క్రేజీ స్టార్ హీరో రణబీర్ కపూర్ ని పెళ్లాడిన సంగతి అందరికీ తెలిసిందే.ఏడాది తిరగకుండానే వీళ్లిద్దరు ఒక బిడ్డకి జన్మని కూడా ఇచ్చేసారు.
రీసెంట్ గా వీళ్లిద్దరి కలిసి ‘బ్రహ్మాస్త్ర’ అనే చిత్రం లో నటించిన సంగతి అందరికీ తెలిసిందే.భారీ అంచనాల నడుమ, కనీవినీ ఎరుగని రీతిలో అన్నీ ప్రాంతీయ బాషలలో విడుదలైన ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో తెలిసిందే.ఈ చిత్రం తర్వాత అలియా కి కొరటాల శివ – జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కింది. మొదట్లో ఒప్పుకుంది కానీ, ఆ తర్వాత ఎందుకో తప్పుకుంది.ఇప్పుడు ఆమె స్థానం లో జాన్వీ కపూర్ నటిస్తుంది.