Guess The Actress : ఈ ఫొటోలో ఎంతో క్యూట్ గా కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తు పట్టారా..?, ఈమె వేల కోట్ల రూపాయిల ఆస్తికి అధిపతి, ఎంత ఎదిగినా ఇసుమంత కూడా గర్వం లేని తత్త్వం,స్త్రీ జాతి గర్వపడి, ఆదర్శంగా తీసుకోగలిగే గొప్ప స్వభావం ఆమె సొంతం.అంతే కాదు ఈమె పాన్ వరల్డ్ స్టార్ హీరో కి భార్య, ప్రస్తుతం గర్భం దాల్చి ఉన్న ఈమె అతి త్వరలోనే ఒక బిడ్డకి జన్మని ఇవ్వబోతుంది.

పాన్ వరల్డ్ స్టార్ భార్య అని అనగానే మీ అందరికీ అర్థం అయిపోయి ఉంటుంది. మేము మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన గురించే అని.అప్పొల్లో హాస్పిటల్స్ అన్నిటికి చైర్ పర్సన్ గా వ్యవహరిస్తూ ఉపాసన కొణిదెల ఇంత చిన్న వయస్సులో ఎంత పెద్ద బాధ్యతలను మొస్తుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పైన కనిపిస్తున్న ఫోటో లో ఉన్న క్యూట్ పాప ఉపాసనే.

రామ్ చరణ్ సతీమణి గా ఈమెకి మెగా అభిమానులు ఎంత గౌరవమిస్తారో మన అందరికీ తెలిసిందే. వదినమ్మ అంటూ ఎంతో ఆప్యాయతగా పిలుస్తుంటారు. అంతగా అభిమానించే ఉపాసన త్వరలోనే తల్లి కాబోతుంది అనే వార్త విని ఫ్యాన్స్ ఎంతలా సంబరాలు చేసుకున్నారో ఇప్పటికీ గుర్తుంది. ఆగష్టు లేదా, సెప్టెంబర్ నెలలో డెలివరీ అయ్యే ఛాన్స్ ఉందట. అపోలో హాస్పిటల్స్ ద్వారా లక్షలాది మందికి సేవలు అందిస్తూ, ఎన్నో కార్యక్రమాలు తలపెట్టిన ఉపాసన, కెరీర్ లో అన్నీ చక్కపడ్డా తర్వాతే పిల్లల్ని కనాలని నిశ్చియించుకుంది.

ఆ నిర్ణయానికి గౌరవిస్తూ రామ్ చరణ్ దాదాపుగా పదేళ్ల పాటు భార్యా చెప్పినట్టుగానే నడుచుకున్నాడు. చూసేందుకు ఎంతో ముచ్చటగా అనిపించే ఈ జంట కి సంబంధించిన ఫోటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా లో సర్క్యూలేట్ అవుతూనే ఉంటుంది. రీసెంట్ గా ఉపాసన కి సంబంధించిన చిన్ననాటి ఫోటోలు లీక్ అయ్యాయి.వాటిల్లో కొన్ని ఎక్సక్లూసివ్ గా మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.


