ఈ క్రింద కనిపిస్తున్న చిన్నారి సాధారణమైన వ్యక్తి కాదు..ఈమె స్క్రీన్ మీద కనిపించిందంటే పక్కన ఎంత పెద్ద సూపర్ స్టార్ ఉన్న డామినేట్ అయ్యిపోవాల్సిందే. ఒకపక్క తన అందం తో కుర్రకారులకు పిచ్చెక్కిపోయేలా చేస్తూనే, మరోపక్క తన అద్భుతమైన నటనతో మనల్ని మైమర్చిపోయేలా చేస్తుంది. స్టార్ హీరోయిన్ గా సౌత్ లో ఒక ఊపు ఊపుతున్న సమయం లోనే విలన్ రోల్ చేసి, లేడీ విలన్ రోల్స్ కి ఒక రోల్ మోడల్ గా నిల్చింది ఈమె.

లేడీ విలన్ రోల్స్ కి రోల్ మోడల్ అనగానే మీ అందరికీ అర్థం అయ్యి ఉంటుంది, మేము రమ్యకృష్ణ గురించి మాట్లాడుతున్నాం అని. అలా ఇండస్ట్రీ ఒక ఊపు ఊపేసిన రమ్యకృష్ణ తన చిన్నతనం లో ఎంత అమాయకమైన ముఖం తో కనిపిస్తుందో చూడండి. ‘కంచు కాగడ’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈమె, చిరంజీవి హీరో గా నటించిన ‘చక్రవర్తి’ అనే సినిమా ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఈ చిత్రం లో ఆమె చిరంజీవి కి చెల్లెలుగా నటించింది.

ఆ తర్వాత చిన్న చిన్న సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ వచ్చిన ఈమె కెరీర్ ని ‘అల్లుడు గారు’ అనే చిత్రం మలుపు తిప్పింది. మోహన్ బాబు మరియు కె రాఘవేంద్ర రావు కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఈ చిత్రం తర్వాత ఆమె మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు, ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ సౌత్ లోనే పెద్ద స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది.

అలాంటి సమయం లో ఆమె సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా నటించిన ‘నరసింహ’ అనే చిత్రం లో నీలాంబరి అనే విలన్ రోల్ పోషించి, రజినీకాంత్ తో నువ్వా నేనా అనే రేంజ్ లో పోటీ పడింది. ఈ సినిమా అప్పట్లో సౌత్ లో ఒక ఊపు ఊపింది. తెలుగు లో కూడా తమిళం రేంజ్ లోనే హిట్ అయ్యింది. అలా అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషిస్తూ వచ్చిన ఈమె, బాహుబలి సిరీస్ తో పాన్ వరల్డ్ రేంజ్ కి ఎదిగిపోయింది.అలాంటి స్టార్ హీరోయిన్ కి సంబంధించిన కొన్ని చిన్ననాటి ఫోటోలను ఎక్సక్లూసివ్ గా మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

