రానాలో ఈ టాలెంట్ కూడా ఉందా.. సుమను ఓ ఆట ఆడుకున్నాడుగా..

- Advertisement -

దగ్గుపాటి రానా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. లీడర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైనా ఈ హీరో.. ఎక్కువగా మల్టీ స్టారర్ సినిమాలు చేస్తూ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.. బాహుబలి సినిమా మాత్రం అతని లైపుకు టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి..రానా బుల్లితెరపై షోలలో కూడా కనిపిస్తూ ఉంటాడు.. తనదైన స్టైల్లో పంచులు వేస్తూ అలరిస్తూ వస్తున్నాడు.. తాజాగా పరేషాన్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రానా పరేషాన్ మూవీ నటీనటులతో కలిసి ఈ షోకు హాజరయ్యారు. ప్రోమోలో రానా పేల్చిన పంచ్ లు మాత్రం వేరే లెవెల్ లో ఉన్నాయని ప్రోమో ను చూస్తే తెలుస్తుంది.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

రానా
రానా

పరేషాన్ చిత్ర నటీనటులు తిరువీర్, ప్రణవి కరణం, దర్శకుడు రూపక్ రొనాల్డ్ సన్ కూడా ఈ షోకు హాజరయ్యారు. స్కూల్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి అని సుమ అడగగా యూనిఫామ్, ప్రిన్సిపాల్, ఎగ్జామ్స్, బ్లాక్ బోర్డ్, బుక్స్, ప్లే గ్రౌండ్ అని రానా చెప్పగా ప్లే గ్రౌండ్ జవాబు తప్పు కావడంతో రానా మిగతా జవాబులు చెప్పే అవకాశం కోల్పోయాడు.. ఆ తర్వాత రానా చేసిన రచ్చ అంతా ఇంత కాదు.. సుమకు అసలు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా పంచుల వర్షం కురిపించాడు..

అంతేకాదు బాహుబలి సూప్ చేశారు..అందులో ఏం జరిగింది దేవసేన అని సుమను అడగగా నేను బిర్యానీ పొట్లం కోసం లైన్ లో నిలబడి ఉంటే తిరువీర్ నా చెయ్యి లాగాడని చెప్పింది. రానా వెంటనే దానికి నువ్వేం చేశావ్ అని అడగగా నేను అతని వేలు నరికేశానని సుమ చెప్పగా రానా వెంటనే నరకాల్సింది వేలు కాదు నీ బిర్యానీ పాకెట్ అని పంచ్ వేశారు. ఇక ఎవరితో స్నేహం ఎక్కువకాలం ఉంటుందని సుమ అడగగా చిన్ననాటి స్నేహితులతో అని సమాధానం చెప్పి ప్రణవి రెండు లక్షలు బెట్ పెట్టగా ఆ సమాధానం రైట్ కాదని 500 రూపాయలు పెడతానని రానా తెలిపారు. ఇప్పటివరకు ఈ షోలో 500 ఎవరూ ఇవ్వలేదని సుమ అంటే దాన్ని కూడా ఇచ్చేయండి అంటూ సెటైర్ వేస్తాడు.. మొత్తానికి ఆ షో మొత్తం రానా వళ్లే హైలెట్ అయ్యింది.. మీరు కూడా ప్రోమోను చూడండి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here