Guess The Actress : ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరు స్టార్ హీరోయిన్లే.. కానీ ఒక అమ్మాయి ఈమధ్యనే చనిపోయింది..ఎవరో గుర్తుపట్టండి!

- Advertisement -

Guess The Actress : ఈ ఫొటోలో కనిపిస్తున్న ఈ ఇద్దరు చిన్నారులు ఎవరో గుర్తుపట్టారా..?, ఇందులో ఒక పాప పెద్ద స్టార్ హీరోయిన్ అయ్యి, ఇప్పటికీ చేతినిండా సినిమాలతో ముందుకు దూసుకుపోతుంది. తెలుగు లో ఆమెకి 90 శాతం సక్సెస్ రేట్ ఉంది. తమిళం లో అయితే ప్రతీ స్టార్ హీరో సరసన నటించింది నెంబర్ 1 హీరోయిన్ గా కొనసాగింది. ఇక రెండో అమ్మాయి కూడా అక్క వేసిన బాటలో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది, ఒక రెండు మూడు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.

Guess The Actress
Guess The Actress

కానీ ఆ తర్వాత కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఈ సంఘటన యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసింది. అలా క్యూట్ గా స్వీట్ గా కనిపిస్తున్న ఈ ఇద్దరు చిన్నారులు మరెవరో కాదు. సిమ్రాన్ మరియు ఆమె చెల్లెలు. సిమ్రాన్ తెలుగు మరియు తమిళం భాషల్లో ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ గా ఎదిగిందో మన అందరికి తెలిసిందే.

Simran

తెలుగు లో ఈమె చిరంజీవి , బాలకృష్ణ, నాగార్జున , వెంకటేష్ ఇలా అందరి హీరోల సరసన నటించి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకుంది. ముఖ్యంగా బాలయ్య బాబు తో సిమ్రాన్ చేసిన ‘సమరసింహా రెడ్డి’,’నరసింహ నాయుడు’ చిత్రాలు ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత వెంకటేష్ తో ‘కలిసుందాం రా’, నాగార్జున తో ‘నువ్వు వస్తావని’ వంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ హిట్స్ లో నటించింది సిమ్రాన్. కానీ మెగాస్టార్ చిరంజీవి తో మాత్రం ఈమెకి పెద్ద హిట్స్ లేవు.

- Advertisement -
actress simran

ఇకపోతే చెల్లెలు మోనాల్ నావెల్ కూడా ‘ఇంద్ర ధనుష్ ‘ అనే కన్నడ సినిమా తో కెరీర్ ని ఆరంభించింది. ఆ తర్వాత తమిళం , ఎక్కువగా సినిమాలు చేసింది. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘తమ్ముడు’ సినిమాని తమిళం లో విజయ్ ‘బద్రి‘ అనే పేరుతో రీమేక్ చేసాడు. అందులో హీరోయిన్ గా చేసింది మోనాల్ నావెల్, అయితే ప్రసన్న అనే కొరియోగ్రాఫేర్ ని గాఢంగా ప్రేమించిన మోనాల్ నావెల్, అతనితో బ్రేకప్ అయ్యాక మానసిక సంఘర్షణ కి గురై ఆత్మా హత్య చేసుకుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here