Guess The Actress : ఈ ఫొటోలో క్యూట్ గా అల్లరి చేస్తూ కనిపిస్తున్న అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా..? ఈమె ఒకప్పుడు మిస్ ఇండియా, బాలీవుడ్ ని కొన్ని సంవత్సరాల పాటు శాసించింది. అప్పట్లో ప్రతీ స్టార్ హీరో ఈమె డేట్స్ కోసం క్యూ కట్టేవాళ్ళు, ఇప్పటికీ ఈమె అంటే బాలీవుడ్ లో అదే క్రేజ్. ఇక తర్వాత టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఒక ప్రముఖ హీరోతో ప్రేమాయణం నడిపి పెళ్లి చేసుకొని ఇద్దరి బిడ్డలకు జన్మని ఇచ్చి ఎంతో సుఖవంతమైన జీవితం గడుపుతుంది.

ఆమె మరెవరో కాదు, నమ్రత శిరోద్కర్. సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య గా ఈమె టాలీవుడ్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించినప్పటికీ, బాలీవుడ్ లో మాత్రం మహేష్ బాబు ఈమె భర్తగా పాపులర్ అయ్యాడు. అంతటి క్రేజ్ ఉందన్నమాట ఈమెకి, ఇప్పటికీ ఈమె పేరు బాలీవుడ్ లో ఒక బ్రాండ్. సుమారుగా 50 కి పైగా హిందీ సినిమాల్లో నటించింది. తెలుగు లో మహేష్ బాబు తో వంశీ మరియు చిరంజీవి తో అంజి సినిమాల్లో హీరోయిన్ గా చేసింది.

మహేష్ బాబు ని ప్రేమించి పెళ్లాడిన తర్వాత ఈమె సినిమాలకు దూరం అయ్యింది, మహేష్ బాబు పెట్టిన ఆ కండిషన్ ని గౌరవించే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.అయితే మహేష్ బాబు కి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు మరియు పిల్లలు గౌతమ్ , సితార బాధ్యతలను పూర్తిగా తీసుకుంది. గొప్ప మహిళా వ్యాపారవేత్తగా ప్రాచుర్యం పొందుతూనే, ఆదర్శవంతమైన భార్య గా కూడా ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిని ఇచ్చింది నమ్రత.

హైదరాబాద్ లో మహేష్ బాబు AMB మల్టీప్లెక్స్ మరియు రెస్టారంట్ ఉన్న సంగతి తెలిసిందే. ఇది హైదరాబాద్ జనాలకు ఒక బ్రాండ్ గా మారిపోయింది. వీటికి ఆ బ్రాండ్ ఇమేజి రావడానికి కారణం, వాటి గురించి అందరూ అంత గొప్పగా మాట్లాడుకోవడానికి కారణం నమ్రత శిరోద్కర్ మ్యానేజ్మెంట్ అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇది ఇలా ఉండగా ఆమెకి సంబంధించిన కొన్ని చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియా లో లీక్ అయ్యి వైరల్ గా మారాయి, వాటిని మీరు కూడా చూసేయండి.