Guess The Actress : బాహుబలి సినిమాలో అనుష్క కి డూప్ గా నటించింది ఆ హీరోయిన్ యేనా! ఇన్ని రోజులు గమనించలేదుగా!

- Advertisement -

Guess The Actress : ప్రతీ సినిమాలోనూ ఒక హీరో కి కానీ, హీరోయిన్ కి కానీ డూప్ ఉండడం సర్వ సాధారణం.ఎన్టీఆర్ కాలం నుండి నేటి వరకు కొనసాగుతున్న ట్రెండ్ ఇది.అన్నీ సన్నివేశాలు కేవలం హీరోలతో తియ్యలేము.కొన్ని రిస్కీ షాట్స్ కి దూప్స్ ని వాడుతూ ఉంటారు.అచ్చు గుద్దినట్టు ఆయన హీరోలు మరియు హీరోయిన్ పోలికలతో లేకేపోయినా, కాస్త దగ్గర పోలికలు ఉన్న చాలు డూప్ గా వాడేస్తుంటారు మన దర్శక నిర్మాతలు.

Guess The Actress
Guess The Actress

ఆ తర్వాత కంప్యూటర్ గ్రాఫిక్స్ లో మార్పులు చేసి మన హీరో హీరోయిన్లు చేసినట్టుగానే ప్రాజెక్ట్ చేస్తారు.అలా ప్రముఖ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కి కూడా డూప్ ఉన్నారు.ఈమె హీరోయిన్ గా నటించిన బాహుబలి సిరీస్ ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో మన అందరికీ తెలిసిందే.ఇందులో ప్రభాస్ తల్లి గా మరియు భార్య గా నటించింది అనుష్క శెట్టి.

Anushka Shetty

అయితే షూటింగ్ జరుగుతున్న సమయం లో అనుష్క కి కొన్ని గాయాలు అయ్యాయి. ఆ సమయం లో ఆమె తో షూటింగ్ చెయ్యలేని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు రాజమౌళి సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలకు డూప్ ని వాడి షూట్ చేసారు. ఈమెకి డూప్ గా నటించింది మరెవరో కాదు, ప్రముఖ యంగ్ హీరోయిన్ రుషిక రాజ్. అనుష్క రేంజ్ పొడవు మరియు ఆమె ముఖ పోలికలకు దగ్గరగా ఉండడం తో రాజమౌళి ఆమెని పెట్టి కొన్ని షాట్స్ తీసారట. రుషిక రాజ్ గతం లో ‘అస్మీ’ అనే చిత్రం లో హీరోయిన్ గా నటించింది.

- Advertisement -
Rushika Raj

ఇందులో బోల్డ్ క్యారక్టర్ చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది రుషిక రాజ్.ఈ సినిమాని మీరు ఇప్పుడు యూట్యూబ్ లో చూడవచ్చు. ఇక అనుష్క శెట్టి ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే నవీన్ పోలిశెట్టి హీరో గా యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో MR & MS శెట్టి అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం ఈ ఏడాదిలోనే విడుదల కాబోతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here