Anasuya : రంగమ్మత్తను ఇంద అందంగా ఎప్పుడు చూసుండరు.. మీరూ ఓ లుక్కేయండి

- Advertisement -

Anasuya: మరోసారి సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈసారి ఈ భామ అచ్చమైన తెలుగమ్మాయిలా.. అందమైన కుందనపు బొమ్మలా ఉన్న ఫొటోలు షేర్ చేసింది. పట్టుచీరలో బాపూబొమ్మలా అలరించింది. తన ఎంగేజ్మెంట్ చీరను రీడిజైన్ చేయించి ఆ చీరకట్టులో సందడి చేసింది. 15 ఏళ్ల క్రితం చీరలో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ ఫొటోలు చూసి రంగమ్మత్తను ఇంత అందంగా ఎప్పుడు చూడలేదంటూ కుర్రాళ్లు కామెంట్లు చేస్తున్నారు.

Anasuya
Anasuya

టాలీవుడ్ లో అనసూయ టాప్ యాంకర్. న్యూస్ ఛానెల్ లో యాంకర్ గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి.. ఆ తర్వాత జబర్దస్ షోతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఈ షోలో అనసూయ డ్రెస్సింగ్ స్టైల్ కు కుర్రాళ్లు ఫిదా అయ్యారు. అప్పటి నుంచి అనసూయకు పెరిగిన క్రేజ్ అంతా ఇంతా కాదు. నెమ్మదిగా ఈ భామకు ఈవెంట్లలో అవకాశం రావడం మొదలైంది. అలా ఏ ఛానెల్ లో చూసినా అనసూయే కనిపించే అంత పాపులారిటీ తెచ్చుకుంది. ఇక నెమ్మదిగా ఈ భామకు సినిమా అవకాశాలు రావడం మొదలయ్యాయి.

anu

అలా నెమ్మదిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ క్షణం సినిమాలో నెగిటవ్ షేడ్ లో అలరించింది. ఆ మూవీలో ఈ భామ నటనకు ఫిదా అయిన సుకుమార్.. రంగమ్మత్త పాత్ర కోసం రంగస్థలం సినిమాకు ఎంపిక చేశారు. ఆ పాత్రలో అనసూయ నటనకు యావత్ తెలుగు రాష్ట్రాలు దాసోహమయ్యాయి. ఇప్పటికీ అనసూయను రంగమ్మత్త అని పిలుస్తున్న వాళ్లు చాలా మంది ఉన్నారు. అలా తన సినీ ప్రయాణంలో డిఫరెంట్ రోల్స్ లో దూసుకెళ్తోంది. ఈ బ్యూటీ పుష్ప సినిమాలో దాక్షాయణి పాత్రకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. ఈ పాత్ర వల్ల కొందరు అనసూయను ట్రోల్ కూడా చేశారు.

- Advertisement -
anchor anu

ప్రస్తుతం ఈ భామ ఓ వైపు బుల్లితెరలో షోలు చేస్తూ.. మరోవైపు రియాల్టీ షోలకు జడ్జీగా వ్యవహరిస్తూ.. ఇంకోవైపు సినిమాల్లో నటిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్. కాకపోతే ఈ భామ పోస్టులకు వచ్చే కామెంట్లపై రియాక్ట్ అవతూ ఇంకా ట్రోల్స్ కు గురవుతూ ఉంటుంది. 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here