Guess The Actress : ఈ ఫోటోలో ఉన్న చిన్నారి పుట్టినరోజు నేడు ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?

- Advertisement -

Guess The Actress : సోషల్ మీడియాలో సినీ సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు చక్కర్లు కొడుతూనే ఉంటాయి.. వారి త్రో బ్యాక్ ఫొటోస్ వారి అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి పుట్టినరోజు నేడు.. ఈ చిన్నారి నేటి స్టార్ హీరోయిన్ కూడా.. ఇంతకీ ఈమె ఎవరో గుర్తుపట్టారా.. బొద్దుగా ముద్దుగా కనిపిస్తున్నా ఈ పాప.. సొట్ట బుగ్గల సుందరి మన శ్రద్ధదాస్..

Guess The Actress
Guess The Actress

ముంబై కి చెందిన బెంగాలీ ఫ్యామిలీలో జన్మించింది హీరోయిన్ శ్రద్ధదాస్ Sharddha Das. 1987 మార్చి 4న బిజినెస్ మాన్ సునీల్ దాస్ స్వప్న దాస్ దంపతుల గారాల పట్టి శ్రద్దాదాస్ పుట్టినరోజు నేడు. ఈరోజు నుంచి శ్రద్ధ తన 35వ ఏట అడుగు పెట్టింది. ఈ సందర్భంగా గ్లామర్ హీరోయిన్ శ్రద్ధాదాస్ కి ఆమె అభిమానులు, శ్రేయోభిలాషులు, సినీ సన్నిహితులు పుట్టినరోజు శుభాకాంక్షలు సోషల్ మీడియా వేదికగా తెలుపుతున్నారు.

Shraddha das birthday today see her throwback pics

శ్రద్ధ బ్యాచిలర్ ఆఫ్ మాస్ మీడియా జర్నలిజంలో ముంబైలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తరువాత పలు యాడ్స్ లో కూడా నటించారు. థియేటర్ ఆర్టిస్టుగా పలు స్టేజ్ పెర్ఫార్మెన్సులు కూడా ఇచ్చారు. ప్రముఖ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఆర్టిస్టులు మిశ్రా లాంటివారు నిర్వహించిన వర్క్ షాప్ లోను పాల్గొనింది ఈ బ్యూటీ. శ్రద్ధ గ్లాడ్ ర్యాక్స్ 400 క్యాటలాగ్స్ కు సంబంధించిన ప్రింట్ అండ్ అడ్వర్టైజ్మెంట్ లో కూడా నటించారని సమాచారం.

- Advertisement -
Shraddha das birthday today see her throwback pics

సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. మొదటి సినిమాతోనే తన అందం , అభినయం , నటనతో తెలుగు ప్రేక్షకుల హీరోయిన్ గా మెప్పించింది. ఆ తరువాత టార్గెట్ 18, 20 లవ్ స్టోరీ, అధినేత్రి ముగ్గురు మొగుడు డైరీ వంటి సినిమాలలో హీరోయిన్గా నటించిన కానీ ఆ సినిమాలలో ఊహించిన ఫలితం మాత్రం శ్రద్ధకు రాలేదు. ఇక సెకండ్ లీడ్స్ రోల్స్ లో మాత్రం శ్రద్ధకి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఆర్య 2 , డార్లింగ్, గుంటూరు టాకీస్, డిక్టేటర్ , నాగవల్లి వంటి సినిమాల్లో శ్రద్ధ కి మంచి మార్కులే పడ్డాయి.

బిగ్ స్క్రీన్ పై ఓ వెలుగు వెలుగుతున్న శ్రద్ధదాస్ స్మాల్ స్క్రీన్ పై కూడా తన సత్తా చూపుతోంది. ఢీ 15 డాన్స్ షో తో బుల్లితెర పైన కూడా ఆకట్టుకుంటుంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడు యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ ఫోటోలతో ఇంటర్నెట్ ను హీటెక్కించే పనిలో కూడా ఉంది. ఈ పుట్టినరోజు శ్రద్ధకి మరిన్ని మంచి విజయాలను అందించాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. తన జీవితంలో మంచి సక్సెస్ అందుకోవాలని మనందరం కూడా ఆశిద్దాం.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here