Guess The Actress : సోషల్ మీడియాలో రకరకాల ఫోటోలు వైరల్ అవుతున్నాయి..ముఖ్యంగా సెలెబ్రేటీలకు సంబందించిన ఫోటోలు మాత్రం ఓ రేంజులో చక్కర్లు కొడుతున్నాయి.. ఇక ఇప్పుడు ఓ ఫోటో నెట్టింట హల్ చల్ చేస్తుంది.. ఆ ఫొటోలో ఓ హీరోయిన్ నేచర్ ను ఎంజాయ్ చేస్తూ కనిపించింది.ఇంతకీ ఆమె ఎవరో గెస్ట్ చేశారు.. మీకో హింట్ ఈ అమ్మడు ఉన్నంత తెల్లగా ఇండస్ట్రీలో ఎవరు.. ఈ విషయాన్ని మహేష్ బాబే చెప్పాడు.. ఇంకా గుర్తుపట్టలేదా..ఆమె ఎవరో కాదు మిల్క్ బ్యూటీ తమన్నా..

ఈ మధ్య తమన్నా గురించి ఓ వార్త షికారు చేస్తుంది. తమన్నా , నటుడు విజయ్ వర్మల మధ్య ఏదో రిలేషన్ ఉందని హిందీ మీడియా కోడై కూస్తోంది. దీనికి అనేక కారణాలున్నాయి. ఈ ఇద్దరూ కలిసి ముంబై వీధుల్లో విహారం చేయడం.. పార్టీలకు అటెండ్ అవ్వడంతో ప్రేమించుకోవడమే కాదు.. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అంటున్నారు ఫ్యాన్స్.. గోవాలో జరిగిన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో విజయ్ వర్మతో సందడి చేయడం వంటివి సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో రూమర్స్ కాస్తా నిజాలుగా మారాయని అంటున్నారు నెటిజన్స్. ఇక అది అలా ఉంటే తమన్నా తన సోషల్ మీడియాలో విజయ్‌కు తన కొత్త సినిమా విషయంలో కంగ్రాట్స్ చెబితే.. దీనికి విజయ్ వర్మ..ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేస్తూ.. థ్యాంక్స్ తమటార్ పెట్టాడు..

నటి స్వర్గీయ జమున బయోపిక్ వస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల తాజా సమాచారం. ఈ బయోపిక్‌లో జమున పాత్రలో తమన్నా హీరోయిన్‌గా కనిపించనుందని.. ఆమె జమున పాత్రలో నటిస్తారని తెలుస్తోంది. దీనికోసం ఇప్పటికే ఆమెను సంప్రదించారని సమాచారం. ఆమె కూడా ఈ సినిమాలో ఒప్పుకున్నట్లు టాక్. ఈ చిత్రాన్ని ఓ బడా నిర్మాత నిర్మాణంలో స్టార్ డైరెక్టర్ ఈ సినిమాను రూపోందించనున్నారని తెలుస్తోంది.. మొన్న ఎఫ్ 3 తో పలకరించింది.. ఒక్కో సినిమాలో ఒక్కోలా కనిపిస్తూ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. భోళా శంకర్ సినిమా తో పాటు కొన్ని సినిమాలను చేస్తుంది..