Guess The Actress : ఈ మధ్య కాలం లో సోషల్ మీడియా లో సెలెబ్రిటీల చిన్నప్పటి ఫోటోలు తెగ సందడి చేస్తున్నాయి.ఇప్పుడు హాట్ హాట్ అందాలతో కుర్రకారులను పిచ్చెక్కిస్తున్న ఎంతో మంది హీరోయిన్ల చిన్నప్పటి ఫోటోలను చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతుంటారు.సమంత, త్రిష, రకుల్ ప్రీత్ సింగ్ మరియు పూజ హెగ్డే వంటి స్టార్ హీరోయిన్ల చిన్నప్పటి ఫోటోలను ఇది వరకే మనం చాలా చూసాము, కానీ ఇప్పుడు ఒక యంగ్ హీరోయిన్ కి సంబంధించిన చిన్ననాటి ఫోటోలను చూడబోతున్నాము.ఆమె మరెవరో కాదు ఇషా రెబ్బ.

తెలంగాణలోని వరంగల్ ప్రాంతానికి చెందిన ఈ అచ్చతెలుగు అమ్మాయి కి సోషల్ మీడియా లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు.ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలను అప్లోడ్ చేస్తూ కుర్రకారులను మెంటలెక్కిపొయ్యేలా చేస్తూ ఉంటాది.ఇప్పటి వరకు సుమారుగా తెలుగు , తమిళం మరియు మలయాళం భాషలకు కలిపి 20 కి పైగా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది కానీ పెద్ద స్టార్ హీరోయిన్ కాలేకపోయింది.

అలా అని ఈమెకి హిట్స్ లేక కాదు, హిట్స్ ఉన్నాయి కానీ అవి ఆమెని వేరే లెవెల్ కి తీసుకెళ్లలేకపోయాయి.శేఖర్ కమ్ముల దర్శకత్వం లో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా ఈషా రెబ్బ, ‘అంతకు ముందు ఆ తర్వాత’ అనే సినిమా ద్వారా మెయిన్ హీరోయిన్ గా మారింది.

ఆ తర్వాత ఈమె ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించినప్పటికీ ‘బందిపోటు’ , ‘అమీ తుమీ’ , ‘అరవింద సామెత వీర రాఘవ’ , ‘అ..!’, మరి పిట్టకథలు వంటి చిత్రాల ద్వారా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించింది.ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీ గా మారిపోయిన ఈషా రెబ్బ, సినిమాల్లో సరైన హిట్టు కోసం ఎంతగానో ఎదురు చూస్తుంది.ఇది ఇలా ఉండగా ఆమె చిన్న తనం లో ఉన్నప్పుడు తీసిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారాయి.ఆ ఫోటోలను మీరు క్రింద చూడవచ్చు.