సాయి ధరమ్ తేజ్ మరియు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘సుప్రీమ్’ అనే చిత్రం అప్పట్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. డైరెక్టర్ అనిల్ రావిపూడి ని స్టార్ ని చేసిన చిత్రం ఇది, అలాగే సాయి ధరమ్ తేజ్ కి కూడా మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. అప్పట్లోనే ఈ సినిమా పాతిక కోట్ల రూపాయలకు పైగా షేర్ ని రాబట్టడమే కాకుండా, సుమారుగా 50 కి పైగా కేంద్రాలలో 50 రోజులు పూర్తి చేసుకుంది.

ఈ సినిమాలో హీరో తర్వాత అతి ముఖ్యమైన పాత్ర ‘రాజన్’. మైఖేల్ గాంధీ అనే బుడ్డోడు ఈ పాత్ర చేసాడు.చూసేందుకు ఎంతో క్యూట్ గా ఉన్న ఈ చిన్నోడు ఎవరు అని అప్పట్లో ఆరాలు తీశారు ప్రేక్షకులు. ఈ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో ఈ బుడ్డోడికి తెలుగు మరియు హిందీ బాషలలో వరుసగా సినిమాల్లో నటించే ఛాన్స్ దక్కింది.

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బయోపిక్ గా తెరకెక్కిన ‘సచిన్ : ఏ బిలియన్ డ్రీమ్స్’ అనే చిత్రం లో సచిన్ చిన్నప్పటి పాత్రని పోషించాడు. ఈ సినిమా తర్వాత ఆయన మళ్ళీ తెలుగు లో ‘హలో’ ,’భరత్ అనే నేను’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు.తర్వాత ఈయన వెండితెర కంటే కూడా ఎక్కువగా బుల్లితెర కి పరిమితం అయిపోయాడు.హిందీ లో వరుసగా ఈయన ‘టైప్ రైటర్’, ‘మెంటల్ హుడ్’ , ‘హిస్ స్టోరీ’ మరియు ‘మై : ఏ మథెర్స్ రేజ్’ వంటి వెబ్ సిరీస్ లలో నటించాడు.

ఈ వెబ్ సిరీస్ లు మన తెలుగు ఆడియన్స్ చూడలేదు, అందువల్ల ఈ కుర్రాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు అనే విషయం ఎవరికీ తెలియదు. టీవీ లో సుప్రీమ్ చిత్రం వచ్చినప్పుడల్లా ఈ బుడ్డోడు ఏమయ్యాడు అసలు, ఈ మధ్య సినిమాల్లో కనిపించడం లేదే అనే సందేహం రాక తప్పదు. అయితే ఈ బుడ్డోడికి సంబంధించిన లేటెస్ట్ ఫోటో ఒకటి అందిస్తున్నాము చూడండి.